
Giridih Murder case: తన భార్య కనిపించకుండా పోయిందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. కానీ ఎలాంటి వివరాలు తెలియలేదు. అయితే, అతని అత్తమామలు తమ అల్లుడిపై (ఫిర్యాదుచేసిన వ్యక్తి) అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్యను హత్య చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా పోలీసులకు తన భార్య కనిపింకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. మృతదేహం అనవాళ్లు కనిపించకుండా తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు.
వివరాల్లోకెళ్తే.. భార్యను హత్య చేసి.. స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టిన ఒక షాకాంగ్ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2021లో జార్ఖండ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఈ కేసు గురించిన వివరాలు వెల్లడిస్తూ..గిరిడీలో మనీశ్ కుమార్ బరన్వాల్ అనే వ్యక్తి అర్జుమన్ బానో అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె ఇంకోకరితో తరచూ ఫోన్‌లో మాట్లాతుందనీ, ఇది నచ్చని భర్త ఆమె ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. తన కుట్రను అమలు చేయడానికి తన సొంతూరుకు వెళ్దామని చెప్పి.. కారులో కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆమె గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.
ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతూ.. మృతదేహం కనిపించకుండా తన స్నేహితుడి ఇంట్లో పాతిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత తన భార్య కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. తనపై అనుమానం రాకుండా భార్య అచుకీ లభించిందా అంటూ నిత్యం పోలీసులను ఆశ్రయించేవాడు. అయితే, మృతురాలి కుటుంబం మనీశ్ పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తమదైన తరహాలో విచారించడంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు. పోలీసులు మృతురాలిని పాతిపెట్టిన ప్రాంతంలో తవ్వకాలు జరపగా అస్థిపంజరం వెలుగుచూసింది. నిందితుడిపై కేసు నమోదుచేసి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. గిరిడీలో ఆ మహిళ తన మొదటి భర్తను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మరో వ్యక్తితో చనువుగా ఉంటుంది. ఈ విషయమై భర్తతో గొడవ పడటం.. అయినా మారకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకునీ, గొంతు నులిమి హత్య చేశారు. ఈ కేసును వెల్లడించడంలో పోలీసు బృందం చాలా కష్టపడింది. చివరగా మృతురాలి కుటుంబం భర్తపైనే అనుమానం వ్యక్తం చేయడంతో కేసు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చివరికి గ్రామంలోని మాల్డాలో ఇంటిని తవ్వి మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ హెడ్ క్వార్టర్స్ హారిస్ బిన్ జమాన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఈ కేసును ఛేదించింది. ఈ కేసులో హంతకుడు భర్త మనీష్ కుమార్ బరన్వాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
మృతురాలు భర్తను, బిడ్డను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది. పోలీసులు మనీశ్ ను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించారు. ఆ తర్వాత తన సహచరుడు రాజ్‌కమల్ సావ్‌తో కలిసి తన భార్యను మారుతీ వ్యాన్‌లో తీసుకెళ్లి మార్గమధ్యంలో గొంతునులిమి హత్య చేశానని చెప్పాడు. అనంతరం రాజ్‌కమల్ సావ్ ఇంటిలో పాతిపెట్టి సిమెంట్ వేశారు. దీని ఆధారంగా, మాల్దాలోని రాజ్‌కమల్ సావ్ ఇంటిని తవ్వగా, భూమి లోపల నుండి ఒక సంవత్సరం తర్వాత మహిళ అస్థిపంజరం బయటపడింది. ఈ అస్థిపంజరాన్ని డీఎన్‌ఏ పరీక్షకు కూడా పంపనున్నారు. అదే సమయంలో, మృతుడి తల్లిదండ్రులు అతని దుస్తులను కూడా గుర్తించారు. నిందితుడిని జుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అక్కడి నుంచి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.