Begusarai: యువకుడి హత్య ఆ ఊరి గ్రామస్థులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్రమంలోనే వారు పోలీసులు స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బెగుసరాయ్‌లోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం గ్రామస్థుల గుంపు పోలీసు వాహనం, ఇతర వస్తువులను ధ్వంసం చేసింది.
Villagers vandalise police station: ఒక యువకుడి హత్య తర్వాత గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడుతూ.. పోలీసు స్టేషన్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. అలాగే, స్టేషన్ కు వేళ్లే రహదారిని నిరసన కారులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి మరో పోలీసు స్టేషన్ నుంచి మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకుని ఈ దాడిని అడ్డుకున్నారు. గ్రామస్థులను చెదరగొట్టారు.
వివరాల్లోకెళ్తే.. బీహార్ లోని బెగుసరాయ్ లో ఓ యువకుడు చిన్న వివాదంతో హత్యకు గురయ్యాడు. ఈ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత గ్రామస్థులు పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. అలాగే, కర్రలతో పోలీసు వాహనాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. భగవాన్ పూర్ లోని పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న పోలీసు వాహనాన్ని, ఇతర వస్తువులను గ్రామస్థులు రాళ్లు రువ్వడంతో పాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లే రహదారిని దిగ్బంధించారు.
undefined
పోలీస్ స్టేషన్ లో జరిగిన గొడవ గురించి స్థానికులకు సమాచారం అందిన వెంటనే ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను తరిమికొట్టారు. పోలీస్ స్టేషన్ లో గొడవ జరగడానికి రెండు రోజుల ముందు భగవాన్ పూర్ గ్రామానికి ఓ యువకుడిని హత్య చేయడమే ఈ దాడికి కారణమని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం హత్య కేసు నమోదు చేసినట్లు బెగుసరాయ్ పోలీసు సూపరింటెండెంట్ యోగేంద్ర కుమార్ తెలిపారు. చలి మంటల దగ్గర ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే వారిలో ఒకరు ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ ఎంతగా పెరిగిందంటే అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ వ్యక్తిని కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు.
Begusarai | A murder case happened two days back, two people were sitting near a bonfire & one of them had argument with a passerby. In heat of moment, the passerby shot the man. Accused has been identified, FIR filed & stringent actions will be taken: Yogendra Kumar SP Begusarai pic.twitter.com/FToZGaCnnK
— ANI (@ANI)యువకుడి హత్య కేసులో నిందితుడిని గుర్తించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. యువకుడి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో గందరగోళం చెలరేగిందని, ఈ హత్య గ్రామస్తులను ఆగ్రహానికి గురిచేసిందని పోలీసు అధికారి తెలిపారు.
భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో కొన్ని కార్లు పార్క్ చేసినట్లు మాకు సమాచారం అందింది. నిరసనకారులు బ్లాక్ కార్యాలయంలో కూర్చున్నారు. ప్రజలు లోపలికి వచ్చి కార్లను పగులగొట్టారు, వారు పోలీస్ స్టేషన్ ను కూడా ధ్వంసం చేశారు" అని కుమార్ చెప్పారు. గ్రామస్తులను కొందరు దుండగులు రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడేలా చేశారని కుమార్ చెప్పారు. వీడియో ఫుటేజీలో ఇద్దరుముగ్గురు బాలురను సైతం గుర్తించారు. ఎస్ హెచ్ వో ఆదేశాల మేరకు దాడికి పాల్పడ్డవారిలో పలువురిని గుర్తించామనీ, వారిని త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు.