
కొత్త భవనమో లేక మరేదైనా విగ్రహమో ప్రారంభించానికి ఎవరిని ముఖ్య అతిథిగా పిలుస్తారు. సాధారణంగా ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో అదీ కుదరకపోతే ముఖ్య అధికారనో ఆహ్వానిస్తారు. కానీ ఓ గ్రామంలో బర్రెను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, దానితో రిబ్బన్ కట్ చేయించి, దానికి సన్మానం చేశారు. ఈ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
అలా అవకాశం లేదు.. ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై తేల్చేసిన కేంద్రం
కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లాలోని బాలెహోసూర్ గ్రామం అది. ఆ గ్రామంలో 40 ఏళ్ల కిందట ఓ బస్టాప్ నిర్మించారు. అయితే దాని పైకప్పు దశాబ్దం కిందట కూలిపోయింది. ఇక అక్కడి నుంచి దానిని బాగు చేయించాలని ఆ గ్రామస్తులు అడగని ప్రజాప్రతినిధి లేడు. ఎమ్మెల్యేను, ఎంపీని, ఇతర ప్రజాప్రతినిధులందరినీ బస్టాప్ బాగు చేయించాలని అడిగారు. కానీ ఫలితం లేదు. అలాగే అన్ని స్థాయిల అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. అయినా స్పందన లేదు.
Arunachal Pradesh: 19 మంది కార్మికుల గల్లంతు..ఏడుగురిని రక్షించిన IAF బృందం
అయితే ఆ బస్టాప్ ఉన్న ప్రదేశం చివరికి డంపింగ్ యార్డ్‌గా మారింది. ప్రయాణికులు సమీపంలోని హోటళ్లు లేదా ఇళ్ల వద్ద బస్సుల కోసం వేచి నిలబడుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు, ఉద్యోగులు, గ్రామస్తులు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వర్షం పడినప్పుడు అయితే వారి బాధలు వర్ణణాతీతం.
ఇక లాభం లేదనుకొని ఆ గ్రామస్తులే ముందుకొచ్చారు. ఎవరికి చెప్పినా ఎలాంటి ప్రయోజనమూ లేదని నిర్ణయించుకొని గ్రామస్తులే డబ్బులు పోగు చేశారు. ఆ డబ్బులతో తాత్కాలికంగా ఆ బస్ స్టాప్ ను బాగు చేయించారు. రిపేర్ అయిన ఆ బస్ స్టాప్ ను తిరిగి ప్రారంభించాలని ఓ కార్యక్రమం నిర్వహించారు. అయితే వాగ్దానాలు నిలబెట్టుకోని ప్రజా ప్రతినిధులకు బుద్ధి చెప్పేందుకు ఓ బర్రెను ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం దానితోనే రిబ్బన్ కట్ చేయించారు. దానికి సన్మానం చూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోడిపుంజుకి దశదినకర్మలు, 500మందికి భోజనాలు.. దాని త్యాగం మరవలేమంటూ కన్నీరు.. ఎక్కడంటే..
‘‘ ఏళ్లుగా బస్ షెల్టర్‌ను పునరుద్ధరించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు విన్నవించాం. దానిని బాగు చేయిస్తాం అని ఎన్నో సార్లు నాయకులు హామీ ఇచ్చారు. కానీ దానిని నిలబెట్టుకోలేకపోయారు.” అని స్థానికులు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో తెలిపారు.