Arunachal Pradesh: 19 మంది కార్మికుల గ‌ల్లంతు..ఏడుగురిని ర‌క్షించిన IAF బృందం

Published : Jul 23, 2022, 02:56 PM IST
Arunachal Pradesh: 19 మంది కార్మికుల గ‌ల్లంతు..ఏడుగురిని ర‌క్షించిన IAF బృందం

సారాంశం

Arunachal Pradesh: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో గ‌త మూడు వారాల క్రితం 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. వారిలో ఏడుగురి ఆచూకీని రెస్క్యూ అధికారులు గుర్తించారు. మిగిత కార్మికుల ఆచూకీ కోసం వైమానిక ద‌ళం ప్ర‌త్యేక ఛాప‌ర్ల‌తో సెర్చ్ ఆప‌రేష‌న్ చేస్తుంది.

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో  జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. గ‌ల్లంతైన వారిలో ఏడుగురి ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) హెలికాప్టర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో నిమగ్నమై ఉంద‌నీ, ఇప్పటి వరకు ఏడుగురు కూలీలను రక్షించి వైద్య సహాయం అందించామని కురుంగ్ కుమే జిల్లా డీఎం నిఘి బెంగియా తెలిపారు.

ఈ క్ర‌మంలో డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. వైద్య సహాయం, ఇతర అవసరాల కోసం కూలీలను ఒకే చోట ఉంచామ‌ని తెలిపారు. జిల్లా యంత్రాంగం కూడా అవసరమైన సహాయం అందిస్తోందని తెలిపారు. వారికి సహాయం చేయడానికి వైద్య బృందాలను పంపామ‌నీ, తప్పిపోయిన కార్మికుల కోసం IAF హెలికాప్టర్లు కూడా అన్వేషణ మరియు రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రకారం.. డామిన్‌లోని సరిహద్దు రహదారిపై పనిచేస్తున్న 30 మంది కూలీల్లో 19 మంది కూలీలు జూలై 5న గ‌ల్లంత‌య్యారు.

కురుంగ్ కుమే జిల్లా డిప్యూటీ కమీషనర్ నిఘి బెంగియా ఇంకా మాట్లాడుతూ.. గ‌ల్లంతైన 19 మంది కార్మికులను అస్సాం నుండి BRO కాంట్రాక్టర్ బెంగియా బడో యొక్క సబ్-కాంట్రాక్టర్లు తీసుకువచ్చారని, ఈ మేర‌కు జూలై 13 న కొలోరియాంగ్ పోలీస్ స్టేషన్‌లో 19 మంది కార్మికుల తప్పిపోయిన ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. SDRFతో సహా స్థానిక పరిపాలన సిబ్బంది రెస్క్యూ పనిలో నిమగ్న‌మైంది.

తప్పిపోయిన 19 మంది కార్మికులలో 7 మంది కోలుకున్నారని, ఒకరిని ఇంకా రక్షించాల్సి ఉందని  సమాచారం. ఇంకా 11 మంది కూలీలు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో కోలుకున్న కార్మికులు చాలా బలహీనమైన స్థితిలో ఉన్నారనీ,  కూలీల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారికి సరైన వైద్య సహాయం, మందులు, ఆహారం అందజేస్తున్నారు. అదే సమయంలో, తప్పిపోయిన కార్మికుల కోసం వెతకడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) హెలికాప్టర్ ను ఉప‌యోగిస్తున్నారు. ఇది కాకుండా తప్పిపోయిన కూలీలను కనుగొనడానికి SDRF తో పాటు స్థానిక పరిపాలన విభాగం, ప్రజలు సహాయక చర్యలు చేప‌డుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu