తెల్లకోటు లేకుండా, హిజాబ్ ఎందుకు ధరించారని డాక్టర్ తో బీజేపీ కార్యకర్త గొడవ.. వీడియో వైరల్.. కేసు నమోదు

By Asianet NewsFirst Published May 26, 2023, 2:30 PM IST
Highlights

తమిళనాడులో ఓ బీజేపీ కార్యకర్త మహిళా డాక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. రాత్రి సమయంలో ఓ పేషెంట్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లిన అతడు.. తెల్లకోటు ఎందుకు ధరించలేదని గట్టిగా అరుస్తూ డాక్టర్ తోనే గొడవ పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 

తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెల్లకోటు ధరించలేదని హిజాబ్ ధరించిన మహిళా డాక్టర్ తో గొడవకు దిగిన బీజేపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్యూటీ సమయంలో హిజాబ్ ధరించి తెల్లకోటు ఎందుకు వేసుకోలేదని మహిళా వైద్యురాలిని అతడు ప్రశ్నించారు. దీనిని అతడు వీడియో కూడా తీశాడు.

చల్లటి కబురు.. జూన్ 4న కేరళకు రుతుపవనాలు.. ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఉన్నప్పటికీ సాధారణ వర్షాలు..

వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్టణం జిల్లా తిరుపుండికి చెందిన బీజేపీ కార్యకర్త భువనేశ్వర్ రామ్.. అనారోగ్యానికి గురైన సుబ్రమణియన్ అనే వ్యక్తిని చికిత్స కోసం పీహెచ్ సీకి మే 24వ తేదీన రాత్రి సమయంలో తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఉన్న మహిళా డ్యూటీ డాక్టర్ తో భువనేశ్వర్ రామ్ గొడవ పెట్టుకున్నాడు. 

நாகையில் ஹிஜாப் அணிந்த பெண் மருத்துவருக்கு எதிர்ப்பு தெரிவித்த பாஜக நிர்வாகி மீது வழக்கு pic.twitter.com/cyqhRUYMmQ

— Raj 😷 (@thisisRaj_)

‘‘మీరు నిజంగా డాక్టర్ ఆ ? కాదా ? ఈ విషయంలో నాకు అనుమానంగా ఉంది. మీరు యూనిఫాం ఎందుకు ధరించలేదు. హిజాబ్ ఎందుకు ధరించారు’’ అని అతడు తన సెల్ ఫోన్ లో వీడియో రికార్డు చేస్తూ ఆ డాక్టర్ పై గట్టిగా అరుస్తూ ప్రశ్నించాడు. ఆ డాక్టర్ తో గొడవకు దిగాడు. ఆ డ్యూటీ డాక్టర్ ను కాపాడేందుకు వచ్చిన పీహెచ్ సీ నర్సింగ్ సిబ్బంది కూడా.. రామ్ ఆ డాక్టర్ తో గొడవ పడుతున్న వీడియోను రికార్డ్ చేసి తరువాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. 

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఆరు వారాల పాటు బెయిల్..

దీంతో స్పందించిన పోలీసులు భువనేశ్వర్ రామ్ పై ఐపీసీ సెక్షన్ 294 (బి) (బహిరంగ ప్రదేశంలో అశ్లీల పదాలు మాట్లాడటం), 353 (ప్రభుత్వ సేవకుల విధులు నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా క్రిమినల్ బలప్రయోగం), 298 (మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశ్యంతో మాట్లాడటం) కింద మూడు కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు అధికారులు చెప్పినట్టు ‘పీటీఐ’ నివేదించింది. 

click me!