భారత్ లోని 99 శాతం ముస్లింల పూర్వీకులు హిందుస్థానీలే - ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్

By team teluguFirst Published Nov 14, 2022, 10:16 AM IST
Highlights

భారతదేశంలో ప్రస్తుతం నివసిస్తున్న ముస్లింల 99 శాతం మంది పూర్వీకులు హిందూస్థానీలు అని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్వహించిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

భారతదేశంలోని 99 శాతం మంది ముస్లింలు వారి పూర్వీకులు, సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభూమి ఆధారంగా హిందూస్థానీలే అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకుడు ఇంద్రేష్ కుమార్ ఆదివారం అన్నారు. భారతీయులకు ఉమ్మడి పూర్వీకులు ఉన్నారని, అందుకే వారి డీఎన్‌ఏ ఉమ్మడిగా ఉంటుందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా ఆయన సమర్థించారు.

జీ20 సదస్సు కోసం నేడు ఇండోనేషియాకు ప్రధాని మోదీ.. ఆ అంశాల గురించి ప్రస్తావించనున్నట్టుగా వెల్లడి..

ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగమైన ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) కార్యకర్తలతో థానే జిల్లాలోని ఉట్టాన్లోని రాంభావ్ మహల్గి ప్రబోధినిలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ముగింపు కార్యక్రమంలో కుమార్ ఆదివారం ప్రసంగించారు. ‘‘మన దేశం పట్ల మన కర్తవ్యాన్ని మనం అత్యున్నతమైనదిగా పరిగణించాలి. పవిత్ర ఖురాన్ ఆదేశాలు, సిద్ధాంతాల ప్రకారం అన్నింటి కంటే అన్నింటి కంటే గొప్పదిగా భావించాలి. భారతదేశంలో 99 శాతం మంది ముస్లింలు తమ పూర్వీకులు, సంస్కృతి, సంప్రదాయాలు, మాతృభూమి ప్రకారం హిందుస్థానీలు’’ అని ఆయన తెలిపారు.

ఇంగ్లాండ్, పాకిస్థాన్ మ్యాచ్.. పంజాబ్ లో జమ్మూకాశ్మీర్, బీహార్ విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ..

భారతీయులు ఉమ్మడి డీఎన్ఏ కలిగి ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గతంలో చేసిన ప్రకటనను కుమార్ ప్రస్తావిస్తూ.. ‘‘ డీ అంటే మనం ప్రతిరోజూ పొందే కలలు. ఎన్ అంటే స్థానిక దేశాన్ని సూచిస్తుంది. ఏ పూర్వీకులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మనమందరం మన మాతృభాషలో కలలు కంటాం.’’ అని ఆయన అన్నారు. మనందరికీ సాధారణ పూర్వీకులు ఉన్నామని, అది మనందరికీ ఉమ్మడి డీఎన్ఏను పంచుకునేలా చేస్తుందని అన్నారు.

ఇనుము దొంగిలించారని ఇద్దరిని పోల్‌కు కట్టేసి చితకబాదిని గుంపు.. బీహార్‌లో ఘటన

ఈ వర్క్‌షాప్‌కు రాష్ట్రవ్యాప్తంగా 40కి పైగా ప్రాంతాల నుంచి మహిళా కార్యకర్తలతో పాటు మొత్తంగా 250 మంది కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఎం జాతీయ కన్వీనర్లు ఇర్ఫాన్ అలీ పిర్జాడే, విరాగ్ పచ్‌పూర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఎంఆర్ఎం ను 2002లో స్థాపించారు. ఇది ట్రిపుల్ తలాక్, జమ్మూ కాశ్మీర్, అయోధ్య, గోహత్య, ఉగ్రవాదం వంటి సమస్యలు మాట్లాడింది.

click me!