Tamilnadu Rains : విషాదం.. ఇల్లు కూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి...

Published : Nov 19, 2021, 02:55 PM IST
Tamilnadu Rains :  విషాదం.. ఇల్లు కూలి నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి...

సారాంశం

తమిళనాడులో కురుస్తున్న వర్షాల కారణంగా వెల్లూరు జిల్లాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి Stalin దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వెల్లూరు జిల్లాలో ఇల్లు కూలి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి Stalin దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం రాజధాని నగరం chennai  కూడా భారీ వర్షాలతో జలమయమయ్యింది. ఇదిలా ఉండగా.. Bay of Bengalలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తెల్లవారుజామున తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో Rainfall క్రమంగా బలహీనపడుతోందని ప్రకటించింది. అయితు, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 

ఇదిలా ఉండగా, గత కొన్నిరోజులుగా చెన్నై మహానగరాన్ని భారీ వర్షం వణికిస్తున్న సంగతి తెలిసిందే. కుంభవృష్టి కారణంగా నగరం దాదాపు నీటమునిగింది. అయితే ప్రతిసారి ప్రజలను, ప్రభుత్వాన్ని హెచ్చరించే ..వాతావరణ శాఖ చెన్నై వాసులకు ఎలాంటి భారీ వర్ష సూచన చేయలేదు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు మాత్రమే రెయిన్ అలర్ట్ ఇచ్చింది. 

కానీ మద్రాస్‌లో ఆ రెండు జిల్లాలను మించి 207 మిల్లీమీటర్ల మేర కుండపోత వాన కురిసింది. 2015 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే ప్రథమం. ఈ పరిణామం IMDని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై వాతావరణ శాఖ దక్షిణాది విభాగం చీఫ్ బాలచంద్రన్ వివరణ ఇచ్చారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులను 'మెసస్కేల్ ఫినామినా' అంటారని తెలిపారు. ఈ పరిస్థితిని ముందుగా అంచనా వేయలేమని తెలిపారు. 

Chennai Rains: భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి.. ఎస్ఐ రాజేశ్వరి కాపాడిన వ్యక్తి మృతి

చెన్నైలోని nungambakkam, meenambakkam మధ్య కేవలం 20 కిలోమీటర్ల దూరం మాత్రమేనని, కానీ నుంగంబాక్కంలో 20 సెంటిమీటర్లు, మీనంబాక్కంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. పక్కపక్కన ఉన్న ప్రాంతాల్లోనూ తీవ్ర వ్యత్యాసంతో వర్షపాతం నమోదవడం 'మెసస్కేల్ ఫినామినా' కిందికి వస్తుందని బాలచంద్రన్ పేర్కొన్నారు. 

రోజువారీ పరిశోధనలో భాగంగా ఈ నెల 6కి సంబంధించి గాలి దిశ, మేఘాల కదలికలను పరిశీలిస్తున్నప్పుడు తమ అంచనాల్లో చెన్నై నగరం లేదన్నారు. అందుకే చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలకు మాత్రం భారీ వర్షసూచన ఇచ్చామని బాలచంద్రన్ వెల్లడించారు. కానీ చెన్నై నగరంలో ఊహించని విధంగా కొద్ది గంటల్లోనే కుంభవృష్టి కురిసిందని ఆయన చెప్పారు. 

మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చెన్నై నగర పాలక సంస్థపై madras high court కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడాదిలో సగం రోజులు నీటికోసం గగ్గోలు పెడతారని, మరో ఆరు నెలలు నీటిలోనే చనిపోయేట్టు చేస్తారంటూ మండిపడింది. 2015 వరదల తర్వాత గత ఐదేళ్లలో అధికారులు ఏం చేస్తున్నారని చీఫ్ జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ పీడీ ఆదికేశవుల ధర్మాసనం నిలదీసింది. పరిస్థితి అదుపులోకి రాకుంటే ఈ అంశంపై సుమోటాగా విచారణ చేపడతామని ధర్మాసనం హెచ్చరించింది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్