Clean Plant Projects : ల్యాబ్ టు ల్యాండ్ .. రైతులకు వ్యాధులే లేని మొక్కలు అందించేందుకు కేంద్రం కీలక ప్రకటన

Published : Jun 03, 2025, 09:38 PM IST
Clean Plant Projects : ల్యాబ్ టు ల్యాండ్ .. రైతులకు వ్యాధులే లేని మొక్కలు అందించేందుకు కేంద్రం కీలక ప్రకటన

సారాంశం

రైతులకు వ్యాధి లేని మొక్కలు అందించడానికి 'క్లీన్ ప్లాంట్' ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ₹300 కోట్లతో దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించాచారు.   

Clean Plant Projects: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జూన్ 3న పూణేలోని వ్యవసాయ కళాశాలలో జరిగిన మొదటి అంతర్జాతీయ వ్యవసాయ హ్యాకథాన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు వ్యాధి లేని మొక్కలు అందించడానికి త్వరలోనే 'క్లీన్ ప్లాంట్' ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ₹300 కోట్లతో దేశవ్యాప్తంగా 9 'క్లీన్ ప్లాంట్లు' ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

క్లీన్ ప్లాంట్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి?

శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ… 'వికసిత కృషి సంకల్ప్ అభియాన్'లో భాగంగా ఇప్పటివరకు తాను పర్యటించిన రాష్ట్రాల్లో రైతులతో మాట్లాడినప్పుడు, ఎక్కువ సమస్యలు ఉద్యానవనాలకు సంబంధించినవేనని గుర్తించానని అన్నారు. రైతులకు అందుతున్న మొక్కలు వ్యాధి లేనివా కాదా అనేది వారికి తెలియదు. అందుకే రైతులకు వ్యాధి లేని మొక్కలు అందేలా చూసుకోవడం మన బాధ్యత. దీనికోసం త్వరలోనే 'క్లీన్ ప్లాంట్' ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం.

ద్రాక్ష, నారింజ, దానిమ్మలకు క్లీన్ ప్లాంట్

మహారాష్ట్రలో ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నందున, 9 'క్లీన్ ప్లాంట్ల'లో 3 మహారాష్ట్రలో ఏర్పాటు చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ద్రాక్ష కోసం పూణే నుండి, నారింజ కోసం నాగ్‌పూర్ నుండి, దానిమ్మ కోసం సోలాపూర్ నుండి 'క్లీన్ ప్లాంట్' ప్రారంభమవుతుంది. ఈ మూడు ప్లాంట్ల ఏర్పాటుకు ₹300 కోట్లు ఖర్చవుతుంది. అత్యాధునిక నర్సరీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నర్సరీలను ఆధునిక సాంకేతికతతో పనిచేసేవారికే ఇస్తారు.

నర్సరీలకు ₹1.5 నుండి ₹3 కోట్ల సాయం

పెద్ద నర్సరీలకు రూ.3 కోట్లు, మధ్యస్థాయి నర్సరీలకు రూ.1.5 కోట్ల సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు 8 కోట్ల వ్యాధి లేని మొక్కలు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 'క్లీన్ ప్లాంట్' కార్యక్రమం విజయవంతమైతే మహారాష్ట్ర ఉద్యానవనాలు ప్రపంచ స్థాయిలో పోటీ పడతాయని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ వంటి దేశాల విజయవంతమైన ప్రయోగాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

వ్యవసాయం లాభదాయకంగా మారాలంటే 6 చర్యలు అవసరం

రైతుల వ్యవసాయం లాభదాయకంగా మారాలంటే 6 చర్యలు అవసరమని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. హెక్టారుకు ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి ఖర్చు తగ్గించడం, ఉత్పత్తులకు సరైన ధరలు లభించేలా చూడడం, నష్టాలకు పరిహారం, వైవిధ్యీకరణ వంటి చర్యలు తీసుకోవాిలన్నారు.

'ల్యాబ్ టు ల్యాండ్'

'ల్యాబ్ టు ల్యాండ్' కోసమే 'వికసిత కృషి సంకల్ప్ అభియాన్'ను రూపొందించామని చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో శాస్త్రవేత్తలు ప్రయోగశాలల నుండి బయటకు వచ్చి, గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడి, పరిశోధనల గురించి సమాచారం అందించాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?
Hubballi : వధూవరులు లేకుండానే రిసెప్షన్ !