జడ్ కేటగిరి భద్రత వెనక్కిచ్చిన ముకుల్‌రాయ్

Published : Jun 17, 2021, 03:19 PM IST
జడ్ కేటగిరి భద్రత వెనక్కిచ్చిన ముకుల్‌రాయ్

సారాంశం

 బీజేపీని వీడి టీఎంసీలో చేరిన ఎంపీ ముకుల్‌రాయ్‌కు గురువారం నాడు కేంద్రం జడ్ కేటగిరి రక్షణను ఉపసంహరించుకొంది.

కోల్‌కత్తా: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన ఎంపీ ముకుల్‌రాయ్‌కు గురువారం నాడు కేంద్రం జడ్ కేటగిరి రక్షణను ఉపసంహరించుకొంది.  ముకుల్ రాయ్ వినతి మేరకు టీఎంసీ నేత ముకుల్ రాయ్ కి కల్పించిన భద్రతను ఉపసంహరించుకొన్నట్టుగా సీఆర్‌పీఎఫ్ వర్గాలు ప్రకటించాయి.

గత వారంలో ముకుల్ రాయ్ బీజేపీని వీడి టీఎంసీలో చేరారు. టీఎంసీలో చేరిన సమయంలోనే  తనకు కేటాయించిన జడ్ కేటగిరిని ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర హోంమంత్రిత్వశాఖు లేఖ రాశాడు. 
కృష్ణానగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుండి  బీజేపీ అభ్యర్ధిగా విజయం సాధించిన ముకుల్ రాయ్ ఇటీవలనే లేఖ రాశాడు.

గత వారంలో తన కొడుకు సుబ్రంగ్షు తో కలిసి కోల్‌కత్తాలో మమత బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీలో చేరారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పించిన తర్వాత ఆయన ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. 2017 నవంబర్ లో ఆయన బీజేపీలో చేరారు. ముకుల్ రాయ్ కి బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టింది. దీంతో ఆయనకు సీఆర్‌పీఎఫ్  భద్రతను కల్పించింది. ముకుల్ రాయ్ కి 22-24 మంది సాయుధ సీఆర్‌పీఎఫ్ సాయుధ కమాండోలు రక్షణగా ఉండేవారు. బెంగాల్ రాష్ట్రలో ఆయన పర్యటించిన సమయంలో ఆయనకు ఈ రక్షణ కొనసాగేది.ముకుల్ రాయ్ తో పాటు ఆయన కొడుకుకు  బెంగాల్   ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?