పది నెలల్లో 11సార్లు కరోనా టీకా.. ఓ వృద్ధుడి అత్యుత్సాహం.. అది నిరూపించడానికే...

Published : Jan 05, 2022, 10:25 AM IST
పది నెలల్లో 11సార్లు కరోనా టీకా.. ఓ వృద్ధుడి అత్యుత్సాహం.. అది నిరూపించడానికే...

సారాంశం

ఓ వ్యక్తి మాత్రం కరోనా టీకాను పిప్పరమెంట్ బిళ్లలా చంపరించాడు. ఏకంగా పది నెలల్లో 11 సార్లు వేయించుకున్నాడు. కరోనా టీకాకు అడిక్ట్ అయినట్టుగా వ్యవహరించాడు. ఎక్కడ టీకా కార్యక్రమం జరుగుతున్నా వెళ్లడం టీకా వేయించుకోవడం.. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మాధేపుర : ఇప్పటివరకు దేశంలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు Corona vaccination తీసుకుని ఉంటారు? మొదటి, రెండో డోసులు కలిపితే గరిష్టంగా రెండు సార్లు. ఒకవేళ Booster Dose తీసుకుంటే.. అదింకా అందరికీ అందుబాటులోకి రాలేదు కానీ.. ఒకవేళ తీసుకుంటే దానితో కలిపి మూడు.. అంతేకదా. 

కానీ ఓ వ్యక్తి మాత్రం కరోనా టీకాను పిప్పరమెంట్ బిళ్లలా చంపరించాడు. ఏకంగా పది నెలల్లో 11 సార్లు వేయించుకున్నాడు. కరోనా టీకాకు అడిక్ట్ అయినట్టుగా వ్యవహరించాడు. ఎక్కడ టీకా కార్యక్రమం జరుగుతున్నా వెళ్లడం టీకా వేయించుకోవడం.. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఓ వ్యక్తి మాత్రం తాను మొత్తం 11 times టీకా తీసుకున్నట్లు ప్రకటించి షాక్ కు గురి చేశాడు. అలాగని అదేదో వ్యాక్సిన్ ఇచ్చే నర్సుల తప్పిదమో, డాక్టర్ల పొరపాటో కాదు.. సదరు వ్యక్తి కావాలనే.. ఉద్దేశపూర్వకంగానే 11 డోసులు వేయించుకున్నాడు. ఒక్క డోసు వేయించుకోవడానికి జనాలు నానా తంటాలు పడుతున్నారు. భయాందోళనలకు గురవుతూ Vaccination centers నుంచి, ఇంటి ముందుకు వచ్చిన అధికారులకు కనిపించకుండా పారిపోతున్నారు. 

భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్క రోజే 58 వేలకు పైగా కొత్త కేసులు.. 2 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

అలాంటిది ఈ వ్యక్తి ఇలా చేయడానికి కారణమేంటి? అన్నిసార్లు అతను టీకాను ఎలా తీసుకున్నాడు? అదెలా సాధ్యం అయ్యింది? వివరాల్లోకి వెడితే.. Bihar లోని మాధేపుర జిల్లాకు చెందిన 84 యేళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్ మండల్ 11 సార్లు టీకా తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీకా తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందువల్లే అన్నిసార్లు వేసుకున్నానని చెప్పాడు.

జిల్లాలోని ఉదకిషన్ గంజ్ సబ్ డివిజన్ ఒరాయ్ గ్రామానికి చెందిన బ్రహ్మదేవ్.. 12వ డోసు తీసుకునేందుకు చౌసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లానని తెలిపారు. అయితే అక్కడ టీకాల కార్యక్రమం ముగియడంతో 12వ డోసు పొందలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. పోస్టల్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన తొలి డోసు 13 ఫిబ్రవరి, 2021న తీసుకున్నారు. అప్పటినుంచి డిసెంబర్, 2021 వరకు 11 డోసులు వేసుకున్నాడు. 

Coronavirus: కోవిడ్ నిధుల వినియోగంలో వెనుక‌బ‌డ్డ ఈశాన్య రాష్ట్రాలు.. టాప్‌లో ఢిల్లీ, త‌మిళ‌నాడు

అంతేకాదు.. తాను ఏయే తేదీల్లో టీకా వేసుకున్నదీ.. మర్చిపోకుండా ఎంచక్కా ఆయన రాసి పెట్టుకోవడం మరో విశేషం. ఈ విషయం బయటికి తెలియడంతో స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చచ్చిబతికినంత పనవుతుంటే... ఇన్నిసార్లు ఇన్ని డోసులు తీసుకుని ఎలా ఉండగలిగాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అంతేకాదు మొదటి డోసు, రెండో డోసు మధ్య పరిమిత కాల వ్యవధి ఉండేలా చూసుకోవాలని వైద్యులు చెబుతారు. అలాంటిది పది నెలల్లో 11సార్లు టీకాలంటే.. ఒకదానికి, రెండో దానికి మధ్య కనీసం నాలుగు వారాల గ్యాప్ కూడా లేదు. ఎలా అతను సర్వైవ్ అయ్యాడు అనే అంశాలూ చర్చనీయంగా మారాయి. దీంతో స్థానిక జిల్లా యంత్రాంగం స్పందించింది. దీనిమీద విచారణకు ఆదేశించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌