భారత్ నుంచి వెంటనే వెనక్కి వచ్చేయండి.. దేశపౌరులకు అమెరికా ఆదేశాలు..

By AN TeluguFirst Published Apr 29, 2021, 12:08 PM IST
Highlights

భారత్ లో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనాతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా భారత్ ను వీడి స్వదేశానికి తిరిగి రావాలని అమెరికా తాజాజా తమ దేశ పౌరులను ఆదేశించింది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఆఫైర్స్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.

భారత్ లో ప్రస్తుతం ఉన్న కరోన ఉదృతితో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా అనారోగ్యానికి గురైతే వైద్యం పొందడం అంత సులభం కాదని పేర్కొంది. కాబట్టి భారత్ లో ఉన్న అమెరికా పౌరులు వెంటన స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. 

ఈ మేరకు లెవల్ 4 హెచ్చరికలు కూడా జారీ చేసింది. అందుబాటులో ఉన్న రోజువారీ డైరెక్ట్ విమానాల ద్వారా యూఎస్ చేరుకోవాలని సూచించింది. నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో లేని పక్షంలో వయా పారిస్, ఫ్రాంక్ ఫర్ట్ ద్వారా స్వదేశానికి చేరుకోవాలని తెలిపింది. అలాగే అమెరికా నుంచి భారత్ కు ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా హెచ్చరించింది.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!