ల్యాండ్ ఫర్ జాబ్ కేసు.. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెయిల్..

Published : Mar 15, 2023, 01:09 PM IST
ల్యాండ్ ఫర్ జాబ్ కేసు.. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బెయిల్..

సారాంశం

బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఊరట లభించింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమార్తె మీసా భారతి తదితరులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఊరట లభించింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమార్తె మీసా భారతి తదితరులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది. అయితే లాలూ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు. ఒక్కొక్కరికి రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఒకరి పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి అరెస్టు చేయకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ వీల్‌ఛైర్‌లో ఉదయం 10 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఆయన భార్య రబ్రీ దేవి కూడా కోర్టుకు వచ్చారు. అయితే  విచారణ ఆలస్యంగా జరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ ఎదుట లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

ఇక, ఈ కేసు విషయానికి వస్తే.. 2004- 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడ ఆయన కుటుంబానికి బహుమతిగా ఇచ్చిన లేదా విక్రయించిన భూములకు బదులుగా రైల్వేలో నియామకాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించినది.రైల్వేలో అక్రమ నియామకాలు జరిగాయని, రిక్రూట్‌మెంట్ కోసం భారతీయ రైల్వే నిర్దేశించిన నిబంధనలు, విధానాలను ఉల్లంఘించాయని సీబీఐ తన చార్జ్ షీట్‌లో పేర్కొంది.

క్విడ్ ప్రోకోగా అభ్యర్థులు నేరుగా లేదా వారి సమీప బంధువులు, కుటుంబ సభ్యుల ద్వారా లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రస్తుత మార్కెట్ ధరలలో ఐదవ వంతు వరకు భారీగా తగ్గింపు ధరలకు భూమిని విక్రయించారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్.. మీసా భారతి సహా నిందితులకు సమన్లు జారీ చేసి మార్చి 15న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !