
పొగమంచు కారణంగా 8 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవల మారిన వాతావారణ పరిస్థితుల నేపథ్యంలో కర్నాటకలో ఉష్టోగ్రతలు తగ్గిపోయాయి. దీంతో చలిపెరిగింది. పొగమంచు కూడా కురుస్తోంది. గురువారం ఉదయం నేషనల్ హైవే నెంబర్ 48 బెంగళూరు-తుమకూరు జాతీయ రహదారిపై కూడా దట్టమైన పొగమంచు వ్యాపించి ఉంది. ఈ క్రమంలో ఉదయం ఈ బెంగళూరు - తుమకూరు హైవేపై పొగ మంచు పేరుకుపోయి ఉండటం వల్ల 8 వాహనాలు ఒకదానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ బెంగళూరు, నేలమంగళ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ హైవేపై ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో మూడు ట్రక్కులు, రెండు కార్లు, రెండు బస్సులు, ఒక జీపు ధ్వంసమయ్యాయని పోలీసులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
షెడ్యూల్ ప్రకారమే యూపీలో ఎన్నికలు... తేల్చేసిన సీఈసీ
సోషల్ మీడియాలో ప్రమాద ఫొటోలు..
బెంగళూరు-తుమకూరు హైవేపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వీటిని సోషట్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇందులో 18 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయని ఆ వీడియోల్లో చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. 5 కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు ఈ వీడియోల్లో కనిపించాయి.
ఒమిక్రాన్ వేరియంట్ లోకల్‌గా వ్యాపిస్తున్నది: ఢిల్లీ మంత్రి