ప్రపంచం ప్రశంసించినా శైలజ టీచర్‌కు దక్కని చోటు: విజయన్ ఒక్కడే, సీపీఎం అనూహ్య నిర్ణయం

By narsimha lodeFirst Published May 18, 2021, 3:00 PM IST
Highlights

కేరళ రాష్ట్రంలో పినరయి విజయన్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త మంత్రివర్గంలో మాజీ ఆరోగ్యశాఖమంత్రి కెకె శైలజకు చోటు దక్కడం లేదు., 

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో పినరయి విజయన్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త మంత్రివర్గంలో మాజీ ఆరోగ్యశాఖమంత్రి కెకె శైలజకు చోటు దక్కడం లేదు., గత టర్మ్ లో విజయన్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసింది శైలజ. కరోనాను కట్టడి చేయడంలో  శైలజ దేశ విదేశాల్లో పేరొందింది. కరోనా కట్టడిలో కేరళ మోడల్ ను ఇతర రాష్ట్రాలతో పాటు కొన్ని దేశాలు కూడ అనుసరించాయి.చరిత్రను తిరగరాస్తూ  కేరళలో రెండోసారి ఎల్డీఎఫ్ ను విజయన్ అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో  కేరళ రాష్ట్రంలో గతంలో మంత్రులను పక్కనబెట్టి కొత్తవారికి స్థానం కల్పించనున్నారని సీపీఎం వర్గాలు తెలిపాయి. 

also read:సిట్టింగ్ మంత్రులకు విజయన్ షాక్: అంతా కొత్త ముఖాలే, శైలజకు సైతం ఉద్వాసన

గత మంత్రివర్గంలో ఉన్నవారెవరికీ కూడ కొత్తమంత్రివర్గంలో చోటు కల్పించరు. పినరయి విజయన్ మినహా ఇతరులు ఎవరికి కూడ పదవులు ఉండవని సీపీఎం నిర్ణయం తీసుకొంది. గత మంత్రివర్గంలో కీలకంగా వ్యవహించిన మంత్రులకు కూడ ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. కొత్తవారికే సీపీఎం అవకాశం కల్పించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఎ.ఎన్ శంషీర్ తెలిపారు.ఈ దఫా ఎన్నికల్లో మెట్టనూరు అసెంబ్లీ స్థానం నుండి  శైలజ టీచర్ 60 వేల మెజారిటీతో విజయం సాధించారు. కరోనా ఫస్ట్ వేవ్ లో  కేరళలో కోవిడ్ ను కట్టడి చేయడంలో ఆమె చూపిన శ్రద్దతో ఆమె పేరు మార్మోగింది. నిఫా వైరస్ ను కట్టడి చేయడంలో కూడ ఆమె సారథ్యంలోని ఆరోగ్యశాఖ మంచి ఫలితాలను సాధించింది. 

యూకేకు చెందిన మేగజైన్ టాప్ థింకర్ గా శైలజను 2020 ఏడాదికి ఎంపిక చేసింది. తాను మంత్రివర్గంలో ఉంటానో ఉండనో ఇప్పుడే చెప్పలేనని విజయం సాధించిన రోజున ఆమె మీడియాకు చెప్పారు. అయితే తమ మంత్రివర్గం అనేక సవాళ్లను ఎదుర్కొందని ఆమె గుర్తు చేసుకొన్నారు. హరికేన్, వరదలు, నిఫా వైరస్, కరోనా తదితర వాటిని సవాల్ గా తీసుకొని పరిష్కరించినట్టుగా ఆమె చెప్పారు.  తమ పాలనను ప్రజలు చూసి తమ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించారని  ఆమె తెలిపాు. 
 

click me!