భారీ ఎన్‌కౌంటర్...8 మంది మావోలు హతం

Siva Kodati |  
Published : Feb 28, 2019, 04:04 PM IST
భారీ ఎన్‌కౌంటర్...8 మంది మావోలు హతం

సారాంశం

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు  సమాచారం అందడంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి

మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. సవేగామ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు  సమాచారం అందడంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

అయితే మావోలు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు కూడా ప్రతిఘటించాయి. ఎదురుకాల్పుల్లో సుమారు 8 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరిని ఇంకా గుర్తించాల్సి వుంది. భారీ సంఖ్యలో సహచరులను కోల్పోవడంతో మావోయిస్టులు ప్రతీకారదాడులకు దిగే అవకాశం ఉండటంతో అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Monsoon : ఈ ఏడాది వర్షాల దెబ్బ.. రుతుపవనాల పై ఐఎండీ షాకింగ్ అప్‌డేట్
Rashmika Mandanna: నయనతారకు షాక్ ఇచ్చిన నేషనల్ క్రష్, ఒక్క సినిమాకు రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?