Naveen Patnaik: అవయవాలు దానం చేసిన వారికి ప్రభుత్వం లాంఛనాలతో అంతిమసంస్కారాలు: సీఎం

By Mahesh K  |  First Published Feb 15, 2024, 9:25 PM IST

అవయవదాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ప్రకటించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గతేడాదే ఇలాంటి ప్రకటన చేశారు.
 


Organ Donors: రోడ్డు ప్రమాదంలో మరణించేవారు.. బ్రెయిడ్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేయడం ద్వారా ఒకరికి మించి ఎక్కువ మందికి పునర్జన్మను ఇచ్చినవారవుతారు. అవయవ దానాల కోసం అవగాహన కార్యక్రమాలు అడపాదడపా జరిగినా.. వాటిపై ప్రచారం పెద్దగా లేదు. అయితే.. ఇటీవలే కొన్ని రాష్ట్రాలు అటువైపుగా అడుగులు వేస్తున్నాయి. అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇలాంటి ఓ సంచలన నిర్ణయాన్నే ప్రకటించారు. 

అవయవదాతల అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం నవీన్ పట్నాయక్ గురువారం ప్రకటించారు. అవయవదానాలకు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇది వరకే ఇటు వైపుగా ఆయన అడుగులు వేశారు.

Latest Videos

undefined

2019లో గంజాం జిల్లాకు చెందిన సూరజ్ అనే బాలుడు బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినప్పుడు ఆయన తల్లిదండ్రలు అవయవదానానికి అంగీకరించారు. బాలుడి గుండె, కాలెయం, మూత్రపిండాలు, కళ్లు దానం చేశారు. తద్వార పలువరి ప్రాణాలను కాపాడగలిగారు. కొత్త జీవితాలను ప్రసాదించగలిగారు. వీరిని సీఎం నవీన్ పట్నాయక్ స్వయంగా కలుసుకుని మాట్లాడారు. వారి స్ఫూర్తివంతమైన నిర్ణయానికిగాను రూ. 5 లక్షలు అందజేశారు. అంతేకాదు, అప్పటి నుంచి సూరజ్ పేరు మీద అవార్డు అందిస్తున్నారు.

Also Read: Electoral Bonds: వైసీపీ, టీడీపీలకు ఎన్ని కోట్ల విరాళాలు అందాయి?

అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించే నిర్ణయాన్ని ఒడిశా కంటే తమిళనాడు ముందుగా చేసింది. అవయవదాతల అంత్యక్రియలను ప్రభుత్వం గౌరవంతో నిర్వహిస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గత సంవత్సరమే ప్రకటించారు. ఇప్పుడు ఇదే బాటలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నడిచారు.

click me!