మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ లో అగ్ని ప్రమాదం: ఆరుగురు కార్మికులు సజీవ దహనం

By narsimha lodeFirst Published Dec 31, 2023, 11:13 AM IST
Highlights


మహారాష్ట్రలోని  ఓ ఫ్యాక్టరీలో  ఆదివారం నాడు  ఆరుగురు కార్మికులు సజీవ దహన మయ్యారు. అగ్ని ప్రమాదం కారణంగా నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లోనే సజీవదహనమయ్యారు.

ముంబై:మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో  ఆదివారంనాడు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో  ఆరుగురు సజీవ దహనమయ్యారు. 

ఛత్రపతి శంభాజీనగర్ లోని  ఓ కంపెనీలో  అగ్ని ప్రమాదం జరిగింది.దీంతో కంపెనీలో పనిచేస్తున్న  ఆరుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు.  అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా  ఐండీసీ ప్రాంతంలోని  కర్మాగారంలో  ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు మంటలు చెలరేగాయి. వెంటనే  సిబ్బందికి తమకు సమాచారం ఇచ్చారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.  అగ్నిమాక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా  అగ్నిమాక శాఖ ఉన్నతాధికారులు  తెలిపారు.  అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఆరుగురు కార్మికులు చిక్కుకున్నారని స్థానికులు చెప్పారని అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందినట్టుగా  అగ్నిమాపక శాఖాధికారులు ధృవీకరించారు.అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఆరుగురు కార్మికులు నిద్రిస్తున్నారు. దీంతో  కార్మికులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. అయితే  మంటలను గుర్తించిన కొందరు కార్మికులు  ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకున్నారు.  అయితే  మిగిలిన వారు మాత్రం ఈ మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు.ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

click me!