2019 ఎన్నికల సమయంలో బీజేపీ (bjp) పుల్వామా దాడి ఘటన (pulwama attack)ను వాడుకుందని కర్ణాటక మంత్రి డి.సుధాకర్ (karnataka minister d.sudhakar) అన్నారు. మళ్లీ 2024 లోక్ సభ ఎన్నికల (2024 lok sabha elections) కోసం అయోధ్య రామ మందిరాన్ని (ayodhya ram mandir) ఓట్ల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
ఓట్ల కోసం బీజేపీ మత విశ్వాసాలను వాడుకుంటోందని కర్ణాటక ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి డి.సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో పుల్వామా దాడిని వాడుకున్నారని అన్నారు. మళ్లీ రాబోయే ఎన్నికల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మళ్లీ మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.
రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
‘‘2019లో ఓట్ల కోసం పుల్వామా (పుల్వామా దాడి ఘటన)ను ప్రొజెక్ట్ చేశారు, ఇప్పుడు రాముడిని వాడుకుంటున్నారు. రామమందిర ప్రారంభోత్సవం ఓ స్టంట్. ప్రజలు మూర్ఖులు కాదు. మమ్మల్ని రెండుసార్లు మూర్ఖులుగా చేశారు. మూడోసారి మోసపోబోము.’’ అని మంత్రి సుధాకర్ అన్నారు.
Wrestlers: ఖేల్ రత్నా, అర్జునా అవార్డులను ఫుట్‌పాత్ పై వదిలేసిన రెజ్లర్ వినేశ్ ఫోగట్
సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి అన్నారు. ‘‘నేను, కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘు మూర్తి కూడా రామ మందిరానికి విరాళాలు ఇచ్చాం. ఇటుకలను కూడా విరాళంగా ఇచ్చాం. రాముడు అందరికీ ఉంటాడు. ఎన్నికల సమయంలో ఆలయ ప్రారంభోత్సవం జిమ్మిక్కు’’ అని సుధాకర్ అన్నారు. ఓట్ల కోసం బీజేపీ మత విశ్వాసాలను వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో రామమందిరం ఎక్కడుందని ప్రశ్నించారు.
జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య బయలుదేరిన తొలి విమానం... కెప్టెన్ ఉద్విగ్నభరిత ప్రకటన (వీడియో)
ఇదిలా ఉండగా.. ఎన్నో వివాదాలు, న్యాయ పోరాటాలు అనంతరం ఎట్టకేలకు రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీని కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని జనవరి 22న రామాలయ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మంది ప్రముఖులు రామ మందిరం ప్రారంభోత్సవానికి రానున్నారని అంచనా. జనవరి 16 నుంచి 22 వరకు రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాలు జరగనున్నాయి.