ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అయోధ్య విమానాశ్రయంలో మొదటి ప్లైట్ ల్యాండ్ అయ్యింది. డిల్లీ నుండి ప్రయాణికులను తీసుకుని ఇండిగో విమానం అయోధ్యకు చేరుకుంది.
అయోధ్య : రామజన్మభూమి అయోధ్యకు మొదటి విమానం చేరుకుంది. ప్రయాణికుల జై శ్రీరామ్ నినాదాలతో డిల్లీ నుండి బయలుదేరిన ఇండిగో విమానం అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. చారిత్రాత్మక అయోధ్య నగరానికి మొదటిసారి విమానంలో వెళుతున్న నేపథ్యంలో ప్రయాణికులే కాదు విమాన సిబ్బంది కూడా కొత్త అనుభూతిని ఫీల్ అయ్యారు. భక్తిభావంతో నిండిన ఆ ప్లైట్ ప్రయాణాన్ని అందరూ ఆస్వాదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నిన్న(శనివారం) అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని న్యూడిల్లీ నుండి ప్రయాణికులతో మొదటి ఇండిగో విమానం అయోధ్యకు బయలుదేరింది. ఈ విమానానికి కెప్టెన్ గా అశుతోష్ శేఖర్ వ్యవహరించారు. ఆయన కూడా ఈ చారిత్రక ప్రయాణాన్ని ఉద్దేశించి కాస్త భావోద్వేగంతో ప్రయాణికులకు ప్రకటన చేసారు. ఈ అద్భుత ప్రయాణం ప్రయాణికులకే కాదు ఇండిగో సంస్థకు కూడా మరుపురానిదని కెప్టెన్ పేర్కొన్నారు.
First flight to Ayodhya from Delhi Commences with the chants of ‘Jai Shri Ram’ 🚩 pic.twitter.com/d9RPmGRYrW
— Megh Updates 🚨™ (@MeghUpdates)
డిల్లీ నుండి అయోధ్యకు వెళుతున్న ప్రయాణికులకు సేవ చేసే అవకాశం తమకు దక్కిందంటూ ఇతర సిబ్బందిని కూడా కెప్టెన్ పరిచయం చేసారు. అలాగే ప్రయాణానికి సంబంధించిన వివరాలతో పాటు వాతావరణ పరిస్థితులను కెప్టెన్ శేఖర్ వివరించారు. ఈ సందర్భంగా కెప్టెన్ అశుతోష్ జై శ్రీరామ్ నినాదం చేయగా ప్రయాణికులు కూడా జైరామ్ అంటూ నినదించారు. ఇలా పూర్తిగా ఆద్యాత్మిక వాతావరణంలో డిల్లీ నుండి అయోధ్యకు విమానం బయలుదేరింది.
Also Read Ayodhya Ram Mandir : అయోధ్య ఆలయంలో ఆరతిలో పాల్గొనే ఛాన్స్ .. రోజుకు 30 మందికే, బుకింగ్ ఎలా..?
అయోధ్యకు బయలుదేరే ముందు ఇండిగో విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా సంబరాలు జరుపుకున్నారు. డిల్లీ విమానాశ్రయంలో కేక్ కట్ చేసి ఈ చారిత్రక ప్రయాణానికి సిద్దమయ్యారు. అనతరం కాషాయ కండువాలు ధరించిన ప్రయాణికులు జై శ్రీరామ్ నినాదాలతో విమానంలో చేరుకున్నారు. అయోధ్యకు వెళుతున్న తొలి విమానంలో ప్రయాణించడం ఎంతో ఆనందంగానూ, గర్వంగానూ వుందని ప్రయాణికులు పేర్కొన్నారు.
అయోధ్యకు విమాన సౌకర్యాన్ని కల్పించినందుకు విమానయాన శాఖతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య నిర్మాణమే చారిత్రాత్మక ఘట్టం... అలాంటి పుణ్యభూమికి తాము విమానంలో వెళుతుండటం... మొదటి ప్రయాణీకులం తామే కావడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఈ ప్రయాణం ఎంతో ఉద్వేగభరితంగా సాగనుందని... ప్రతి ఒక్కరం ఈ దీన్ని ఎంతగానో ఆస్వాదిస్తామని అన్నారు. ఈ రోజు తమ జీవితంలో గుర్తిండిపోనుందని అయోధ్యకు వెళ్లేముందు ప్రయాణికులు పేర్కొన్నారు.