మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం

Published : Apr 05, 2019, 11:07 AM IST
మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం

సారాంశం

దేశరాజధాని ఢిల్లీలో  దారుణం జరిగింది. మతి స్థిమితం సరిగా లేని మహిళపై అత్యాచారం జరిగింది. లజ్ పత్ నగర్ లోని ఓ పార్క్ లో బాధిత మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


దేశరాజధాని ఢిల్లీలో  దారుణం జరిగింది. మతి స్థిమితం సరిగా లేని మహిళపై అత్యాచారం జరిగింది. లజ్ పత్ నగర్ లోని ఓ పార్క్ లో బాధిత మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కాగా.. బాధిత మహిళను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అత్యాచారం జరిగినట్లు తేలింది. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు.సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో పరిగెత్తినట్టు గుర్తించామని, అయితే అతడి ముఖం స్పష్టంగా లేదని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలో అనుమానితులను ప్రశ్నించామని డీసీపీ చిన్మయ్‌ బిస్వాల్‌ చెప్పారు. 

కాగా గతంలో ఓ రెస్టారెంట్‌లో పనిచేసిన సుధీర్‌ అనే వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో అంగీకరించాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించిన వ్యక్తితో సుధీర్‌ పోలిఉన్నాడని, మహిళ ఒంటరిగా ఉన్నట్టు గుర్తించి దారుణానికి తెగబడినట్టు నిందితుడు చెప్పాడని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia
ఆస్ట్రేలియా పర్యటనలో మోదీ సినిమా రేంజ్ లో స్వాగతం | PM Modi Arrives in Melbourne, Australia