పాముందని పొలానికి నిప్పు: ఐదు చిరుత పిల్లలు సజీవదహనం

By Siva KodatiFirst Published Apr 4, 2019, 4:35 PM IST
Highlights

చెరకు పొలంలో పాము ఉందని భావించి నిప్పంటించడంతో ఐదు చిన్నారి పులి పిల్లలు సజీవదహనమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అంబేగామ్ తాలుకా గావడీవాడీ గ్రామానికి చెందిన గోపినాథ్ గునాగేకు చెరకు తోట ఉంది.

ఈ క్రమంలో ఆయన చెరకు కోసేందుకు భీమశంకర్ సహకార చక్కెర కర్మాగారానికి చెందిన కూలీలు ఉదయం ఆరుగంటలకు వచ్చారు. అయితే చెరకు తోటలో అత్యంత విషపూరితమైన పాము కూలీలకు కనిపించింది.

దీంతో పామును చంపేందుకు కూలీలు చెరకు తోటకు నిప్పంటించారు. తోట మొత్తం కాలిపోయిన తర్వాత చూస్తే.... అందులో ఐదు చిరుతపులి పిల్లలు కనిపించాయి. వెంటనే విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు.

వీటి వయసు 15 రోజులు ఉంటుందని, ఇందులో రెండు మగ, మూడు ఆడ పులి పిల్లలు ఉన్నట్లు తెలిపారు. అధికారుల సమక్షంలో చిరుతపులి పిల్లల మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయించి వాటిని పూడ్చిపెట్టారు.

మరోవైపు చిరుతపులి పిల్లలు సజీవదహనం కావడంతో తల్లి చిరుతపులి గ్రామంపై విరుచుకుపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. 

click me!