
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్ నగరంలో వెలుగుచూసింది. యశ్వంత్ పూర్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగుగంటలకు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది.
ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు. శిథిలాల కింద కొందరు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.