గే డేటింగ్ యాప్‌తో హనీట్రాప్: 50 మందికి వల, అంతా కార్పోరేట్ ప్రముఖులే

By Siva KodatiFirst Published Feb 14, 2020, 5:19 PM IST
Highlights

ఆన్‌లైన్ గే డేటింగ్ యాప్‌ ద్వారా ఓ ముఠా గురుగ్రామ్‌లోని ఎంఎన్‌సీ సంస్థలలో పనిచేసే 50 మంది సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దొరికినంత దోచుకుంది

ఆన్‌లైన్ గే డేటింగ్ యాప్‌ ద్వారా ఓ ముఠా గురుగ్రామ్‌లోని ఎంఎన్‌సీ సంస్థలలో పనిచేసే 50 మంది సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దొరికినంత దోచుకుంది. ఈ ముఠాకు చెందిన ఐదుగురి బాద్‌షాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ ముఖేశ్ మాట్లాడుతూ. ఈ ముఠా గత కొన్ని నెలలుగా ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా నగరాల్లోని సంపన్ననులు లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. అయితే ఈ ముఠా బారినపడిన ప్రముఖులు చాలామంది సమాజానికి భయపడి, పరువు పోతుందని పోలీసులను ఆశ్రయించేందుకు ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు.

అంతేకాకుండా బాధితులు బహుళజాతి సంస్థల్లో అత్యున్నత అధికారులుగా ఉండటం కూడా ఈ ముఠా పనిని సులభతరం చేసింది. భోండ్సీకి చెందిన కింగ్‌పిన్ ముఠా మొదట స్వలింగ, ద్విలింగ వ్యక్తుల పేరుతో ప్రముఖులపై హానీ ట్రాపింగ్‌కు పాల్పడేవారు.

Also Read:సెక్స్ పార్ట్ నర్ కోసం వేట... డేటింగ్ యాప్స్ యూత్ ఆప్షన్

ఆ తర్వాత ముఠా సభ్యుల్లో ఒకరు ఫోన్ లేదా ఛాటింగ్ ద్వారా సదరు ప్రముఖుడితో మాట కలిపేవారు. అనంతరం హైవేపై లాంగ్ డ్రైవ్‌కు వెళదామని చెప్పి ఆహ్వానించేవారు. అందుకు ఆ ప్రముఖుడు అంగీకరించిన తర్వాత హైవేపైకి తీసుకెళతారు. అక్కడ అప్పటికే మాటు వేసిన ముఠా సభ్యులు అతనిపై డాడి చేసేవారని పోలీసులు తెలిపారు.

బాధితుల్లో ఏకంగా ప్రైవేట్ కంపెనీల సీఈవోలు కూడా ఉన్నారు. దాడి అనంతరం విలువైన వారి వస్తువులను దోచుకోవడంతో పాటు అశ్లీల చిత్రాలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవారు.

ఈ ముఠాపై ఇప్పటి వరకు ఒకరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఓ డేటింగ్ సైట్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చిందని.. దీనికి అంగీకరించిన తనను వారు పెరిఫెరల్ రోడ్‌కు పిలిచారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read:అమ్మాయిలను పంపే యాప్: 507 మందికి ట్విస్ట్, చివరికిలా....

వారు తనను కారులో ప్రిన్స్ అనే వ్యక్తి పక్కన ముందు సీట్లో కూర్చోబెట్టారని.. అనంతరం ముగ్గురు వ్యక్తులు వెనుక సీట్లో కూర్చొన్నారు తెలిపాడు. కొద్దిసేపటి తర్వాత నలుగురు వ్యక్తులు తన వాలెట్, బ్యాగ్‌ లాక్కొన్నారని.. తన అకౌంట్ నుంచి బలవంతంగా నగదును విత్ డ్రా చేసుకున్నారని బాధితుడు వాపోయాడు.

ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సదరు ముఠాపై ఐపీసీ 379 (ఎ) 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠా సభ్యులు పెద్దగా చదువుకోకపోయినప్పటికీ.. ఇంగ్లీష్‌పై పట్టున్న ఇంజనీర్లను నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. వీరి సాయంతో వారు ప్రముఖులను టార్గెట్ చేశారన్నారు. 

click me!