నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్‌ తిరస్కరించిన సుప్రీం

By narsimha lodeFirst Published Feb 14, 2020, 2:27 PM IST
Highlights

నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను  సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. 


న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ పిటిషన్‌ను శుక్రవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి కోవింద్ తన మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించారని నిర్భయ దోషి వినయ్ శర్మ  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్‌ను శుక్రవారం నాడు కోర్టు తిరస్కరించింది. నియమ నిబంధనల ప్రకారంగానే వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను తిరస్కరించినట్టుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.దీంతో వినయ్ శర్మ  తన మెర్సీ పిటిషన్‌ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను  రద్దు చేసింది. 

Also read:వాటిని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదు: నిర్భయ కేసు దోషి వినయ్ శర్మ

వినయ్ శర్మ మానసికంగా బాగానే ఉన్నట్టుగా మెడికల్ రిపోర్టులు చెబుతున్నట్టుగా కోర్టు అభిప్రాయపడింది.  శారీకంగా కూడ అతనికి ఏమీ ఇబ్బంది లేదని కోర్టు ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు వినయ్ శర్మకు సంబంధించిన అన్ని రకాల రిపోర్టులు ఉంచినట్టుగా కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును, మెడికల్ స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన మెర్సీ పిటిషన్ ను తిరస్కరించారని నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ కోర్టుకు చెప్పుకున్నాడు. వినయ్ శర్మ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో వాదిస్తూ గురువారం వాదించారు.

వినయ్ ను శారీరకంగా హింసించిన చరిత్ర ఉందని, చాలా సార్లు వినయ్ ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకుని వెళ్లారని, పిటిషనర్ మెంటల్ కండీషన్ బాగా లేదని, అంతులేని వేదనను అనుభవించాడని ఆయన అన్నారు.  సుప్రీంకోర్టు శుక్రవారం నాడు వినయ్ శర్మ పిటిషన్‌ను కొట్టివేసింది.

click me!