
Assembly Election Results 2022 : ఎంతో ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల భవితవ్యం నేడు ( గురువారం) తేలనున్నది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఏయే పార్టీలు అధికారంలోకి వస్తాయో తెలనున్నది? అధికారంలో ఉన్న పార్టీ మరో సారి తిరిగి అధికారం చేపట్టేనా? లేక కొత్త వారికి అధికార పగ్గాలు అప్పజేప్పానున్నరనేది మరో కొన్ని గంటల్లో తెలనున్నది.
యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూపీ ఎన్నిక ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.ఈ ఎన్నికల ఫలితంతో పలు పార్టీల భవితవ్యం కూడా తేల్చనున్నది. కాగా, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలోని 690 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 671 మంది కౌంటింగ్ పరిశీలకులు, 130 మంది పోలీసు అబ్జర్వర్లు, 10 మంది ప్రత్యేక పరిశీలకులు రంగంలోకి దిగుతారని సీఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.
యూపీలో అత్యధికంగా.. 403 అసెంబ్లీ స్థానాలున్నాయి.
కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ.. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కరోనా లక్షణాలు కలిగిన వారినెవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించరు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గురువారం సాయం త్రం లేదా రాత్రికల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్యకాలంలో ఏడు విడతల్లో జరిగాయి. ఓట్ల లెక్కింపు జరగడానికి ఒకరోజు ముందు (బుధవారం).. ఉత్తరప్రదేశ్‌లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇదిలా ఉంటే.. యూపీలో బీజేపీ అధికారం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. 403 సీట్లలో బీజేపీ 40 శాతం ఓట్లతో 211 నుంచి 225 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్ చెప్పింది. సమాజ్‌వాదీకి 146 నుంచి 160 సీట్లు, బీఎస్పీకి 14 నుంచి 24, కాంగ్రెస్‌కు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే... లోక్ నీతి- సీఎస్డీఎస్ సంస్థలు నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ నే గెలుపొందుతుందనీ.. దాదాపు 43 శాతం ఓట్లతో ఘన విజయం సాధించనున్నట్లు తేలింది. 2017లో ఇదే శాతం ఓట్లతో బీజేపీకి 300 సీట్లు వచ్చాయి. ఎస్పీకి 35 శాతం, బీఎస్పీకి 15 శాతం, కాంగ్రెస్ కు 3 శాతం ఓట్లు రానున్నాయి.
ఇక పంజాబ్‌లో అన్యూహంగా ఆప్ సర్కార్ ఏర్పాటు చేస్తుందనీ, దాదాపు 40 శాతం ఓట్లతో ఆప్ ఘన విజయం సాధిస్తుందని సర్వేల అంచనా.. ఇక కాంగ్రెస్ కు 26శాతం, ఆకాలీదళ్‌కు 20 శాతం ఓట్లు వస్తాయాని తేలింది. ఇక గోవాలో మరో సారి బీజేపీకి అధికారం చేపట్టనున్నట్టు తేలింది. ఇక్కడ బీజేపీకి 32 శాతం, కాంగ్రెస్ కు 29శాతం, తృణమూల్ కాంగ్రెస్ కు 14శాతం, ఆప్‌నకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందనీ పలు సర్వేలు చెప్పుతున్నాయి.
పంజాబ్‌లో కూడా ఆమ్‌ఆద్మీ పార్టీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతునట్టు అన్ని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. కాంగ్రెస్ నేతల్లో కూడా గెలుపుపై పెద్ద నమ్మకం కన్పించడం లేదు. ఆప్ తరపున భగవంత్ మాన్ సీఎం కావడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. 117 స్థానాలకు పంజాబ్‌లో ఎన్నికలు జరగ్గా ఆప్ స్పష్టమైన మెజారిటీతో అధికారం లోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. పంజాబ్‌లో కౌంటింగ్ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదిలా ఉంటే.. ఫలితాలకు ముందే బేరసారాలకు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో హంగ్ ఏర్పాడనున్నదని పలు వార్తకథనాలు రావడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతల ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీజేపీ తరఫున బేరసారాలు నడిపేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత కైలాష్ విజయ వర్గీయ డెహ్రాడూన్ వచ్చారు.