రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

Published : Aug 08, 2021, 11:23 AM IST
రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

సారాంశం

తెలంగాణలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్ధిగా తొలిసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  

జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని కుచమన్ సిటీలో శనివారం నాడు రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.నాగౌర్‌లోని కుచమన్ సిటీలో శనివారం నాడు రాత్రి కారు, లారీని ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మరణించారు.గాయపడిన ముగ్గురిలో ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. వెంటనే ఆ బాలికను మెరుగైన చికిత్స కోసం జైపూర్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్డు సరిగా కన్పించని కారణంగా  ప్రమాదం జరిగి ఉండవచ్చని  స్థానిక పోలీసులు చెప్పారు.మృతులు, గాయపడినవారంతా రాజల్‌దేసర్ జిల్లాకు చెందిన చురు గ్రామానికి చెందినవారుగా పోలీసులు చెప్పారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. 

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలంలోని క్షతగాత్రులను  కుచమన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఓ బాలికను జైపూర్ ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం