వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఢీ కొని మూడేళ్ల చిన్నారి మృతి..

Published : Dec 28, 2022, 09:35 AM IST
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఢీ కొని మూడేళ్ల చిన్నారి మృతి..

సారాంశం

పంజాబ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. 

పాటియాలా : పంజాబ్‌లోని రోపార్ జిల్లాలోని కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో మంగళవారం ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మూడేళ్ల బాలిక మృతి చెందింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

జీఆర్ పి అధికారులు మరణించిన బాలికకు ఖుషి(3) అని గుర్తించారు. ఆమె తండ్రి వికాస్, వీధి వ్యాపారి. రోజూలాగే అతను రైలు పట్టాలు దాటి వెడుతున్నాడు. అయితే అతని మూడేళ్ల కూతురు అతడిని అనుసరించడం గుర్తించలేదు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే దూరం నుంచి వీరిని గమనించిన రైలు డ్రైవర్‌ మూడుసార్లు హారన్‌ మోగించాడని, అయితే చిన్నారికి రైలు హారన్ విషయం అర్థం కాలేదని తెలుస్తోంది. 

షుగర్ వ్యాధితో బాధపడుతున్న 7, 3 యేళ్ల చిన్నారులు.. తట్టుకోలేక ఆ కుటుంబం చేసిన పని...

వేగంగా వస్తున్న రైలు ఒక చివర కొంత భాగం బాలికను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. “ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఉనా రైల్వే ట్రాక్ వద్ద బాలిక పట్టాలు దాటేందుకు ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాం’’ అని జీఆర్‌పీ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu