అర్దరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 9:27 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. వివరాలు.. జిల్లాలోని షాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం  అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికే ఆ ఇంట్లోని ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఇల్లు కూడా పూర్తిగా దగ్దమైంది. పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య, సహాయక బృందాలు ఘటనాస్థలం నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఇంట్లో గ్యాస్ స్టవ్ నుంచి మంటల చెలరేగినట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ కుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. జిల్లా మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 4 లక్షల సహాయం ప్రకటించారు. ‘‘కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ, ముగ్గురు మైనర్‌లతో పాటు మరోకరు మరణించారు. అగ్నిమాపక దళం, వైద్య, సహాయక బృందాలతో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు’’ అని అనిల్ కుమార్ చెప్పారు. 

click me!