పటాకుల తయారీ కంపెనీలో ప్రమాదం, చిన్నారితో సహా ముగ్గురు మృతి...

By AN TeluguFirst Published Jun 21, 2021, 12:35 PM IST
Highlights

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అక్రమంగా నడుపుతున్న ఓ ఫైర్ క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. దీంట్లో చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

రాష్ట్ర రాజధాని చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న విరుదునగర్ జిల్లాలోని శివకాసి సమీపంలోని థాయిల్‌పట్టిలోని ఫైర్‌క్రాకర్ తయారీ విభాగంలో జరిగిన సంఘటనలో మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం.

తమిళనాడులోని శివకాశిలో క్రాకర్స్ తయారీలో ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటి తయారీ కారణంగా వాతావరణ కాలుష్యం దెబ్బతింటుందని 2018లో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడింది. దీనికి ముందే శివకాశిలోని అనేక కేంద్రాలు  వేలాది మంది కార్మికులను నియమించుకున్నాయి. 

ఈ ఉత్తర్వులు వచ్చిన తరువాత.. వీటిని అనుసరించి, చాలా మంది నిర్వాహకులు ప్రభుత్వం నుండి శిక్షణ, సహాయాలతో "గ్రీన్ క్రాకర్స్" తయారీ వైపుకు మళ్లారు. 

గతంలో, శివకాసిలోని ఫైర్‌క్రాకర్ తయారీ యూనిట్లు భారతదేశపు పటాకులలో 90-95 శాతం సరఫరా చేసేవి. దీని ద్వారా సుమారు 800 మిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేది. 

click me!