విచిత్రం : ఆవుపేడను దొంగిలించిన ప్రబుద్ధుడు.. ఎఫ్ఐఆర్ నమోదు !

By AN TeluguFirst Published Jun 21, 2021, 11:48 AM IST
Highlights

చత్తీస్ గఢ్ లో ఓ విచిత్రమైన కేసు నమోదయ్యింది. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఓ వింత దొంగతనం మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. పోలీసులు కూడా ఇదేం కేసు అని ప్రశ్నించకుండా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ అదేం దొంగతనం అంటే... ఆవు పేడను దొంగిలించాడో ప్రబుద్ధుడు.

పోలీసులు కేసులు లేకుండా మరీ ఖాళీగా ఉన్నారా ఏంటీ? ఇదో కేసు.. దీనిమీద ఫిర్యాదు.. మళ్లీ పోలీసులు దాన్ని విచారించడం అనుకుంటున్నారా? అక్కడే ఉందండీ ట్విస్టు.. అదేంటంటే.. 

చత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలో ఆవు పేడ చోరీ కావడంతో స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 1600 రూపాయల విలువ చేసే 800 కేజీల పేడను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుపోయినట్లు కేసు నమోదయ్యింది.

ఈ నెల ఎనిమిదిన జిల్లాలోని ధురేనా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామాధికారి పోలీసులను ఆశ్రయించారు. గోధన్ న్యాయ్ యోజన పథకం కింద ప్రభుత్వం ఆవు పేడను కిలో రూ. 2 లకు సేకరిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామ ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 

click me!