ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచమంతా వణికిపోతున్నది. విదేశాల నుంచి దేశంలో అడుగుపెట్టిన వారిలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మనదేశంలోనూ భయాలు నెలకొంటున్నాయి. ఈ తరుణంలోనే తమిళనాడులోని ఓ స్కూల్‌లో ఏకంగా 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలోనే పాజిటివ్ తేలిన వారి అందరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపనున్నారు. ఈ టెస్టు ద్వారా వారు కరోనా ఏ వేరియంట్ బారిన పడ్డారో తేల్చనున్నారు.
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) భయాందోళనలు సృష్టిస్తుండగా.. మనదేశంలో అడుగుపెట్టిన విదేశీయుల్లోనూ కరోనా పాజిటివ్(Corona Positive) కేసులు ఈ భయాలను రెట్టింపు చేస్తున్నాయి. ఇదే తరుణంలో Tamil Naduలో పిడుగులాంటి వార్త ఎదురైంది. ఓ స్కూల్‌లో ఏకంగా 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తొలుత ఇద్దరు విద్యార్థులు కరోనా లక్షణాలతో ఓ హాస్పిటల్‌లో చేరగా.. వారికి టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఆ తర్వాత ఆ పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది అందరివి కలిపి 374 మంది శాంపిళ్ల తీసుకుని టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో మరో 25 మందికి కరోనా పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయి. ఒమిక్రాన్ భయాల నడుమ పాజిటివ్ తేలిన వారి టెస్టు శాంపిళ్లను ఏ వేరియంట్ అని తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించనున్నారు.
తమిళనాడు తిరుప్పుర్ జిల్లా ధారాపురంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒంట్లో నలతగా ఉండటం, కరోనా లక్షణాలు కనిపించడంతో గతనెల 27న ఓ హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్ అయ్యారు. వారికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆ స్కూల్‌లోని సిబ్బంది సహా విద్యార్థులు అందరి నుంచి శాంపిళ్లు తీసుకుని టెస్టులు చేయాలని నిశ్చయించుకుంది. నవంబర్ 29న వారి నుంచి శాంపిళ్లు తీసుకుని టెస్టులు చేసింది. తర్వాతి రోజు ఫలితాల్లో 25 మందికి పాజిటివ్ అని వచ్చింది. అందులో పదో తరగతికే చెందిన 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారు. మరొకరు తొమ్మిది తరగతి విద్యార్థిని. వీరందరిలోనూ కరోన లక్షణాలే లేవు. పాజిటివ్ తేలడంతో వారిని హోం ఐసొలేషన్‌కు పంపారు.
undefined
Also Read: Omicron India: భారత్ అప్రమత్తం.. నెగెటివ్ వచ్చినా.. క్వారంటైన్ తప్పనిసరి.. పాజిటివ్ వస్తే..
ఆ పాఠశాలను వారం రోజులపాటు మూసివేయడానికి ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ పాఠశాల ప్రాంగణం అంతా డిస్‌ఇన్ఫెక్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ స్థాయిలో ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కరోనా నిబంధనల అమలు ఎలా జరుగుతన్నాయో పర్యవేక్షించనున్నట్టు పేర్కొంది. తనిఖీలు కూడా చేపట్టనున్నట్టు వివరించింది. ఈ తనిఖీల సమయంలో సిబ్బంది నుంచి కొవిడ్ టీకా సర్టిపికేట్లనూ పరిశీలించనున్నట్టు తెలిపింది.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన భూభాగం ఐరోపా మరియు జపాన్‌తో సహా డజన్ల దేశాలలో ఓమిక్రాన్ వ్యాప్తించినట్టు అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ వారం జర్మనీ, ఇటలీ, మొజాంబిక్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా ల్లో 61 మందికి ఈ వేరియంట్ లక్షణాలు ఉన్నట్టు నిర్థారణ అయ్యింది. ఇక ఆసియాలో ఇజ్రాయిల్, జపాన్ దేశాల్లో ఈ వేరియంట్ బయటపడటంతో మిగతా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
Also Read: ఇండియాలో గత 24 గంటల్లో 9765 కొత్త కేసులు: తగ్గిన రికవరీలు
ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్స్ లోనే వేరియంట్ నిర్థారణ పరిక్షలను తప్పని సరి చేసింది భారత్ సర్కార్. ఈ పరీక్షల్లో కోవిడ్ నెగెటివ్ వచ్చినా సరే.. 14 రోజులు పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా ఈ పరీక్షల్లో పాజిటివ్ అని వస్తే.. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించాలనీ. సదరు బాధితులను క్వారంటైన్ లో ఉంచాలని, అంతే కాకుండా.. 14 రోజుల ట్రావెల్ హిస్టరీని తప్పనిసరిగా విమానాశ్రయం అధికారులకు అందజేయాలి.