Coronavirus: క‌రోనాతో 265 మంది పోలీసులు మృతి.. ఆస్పత్రిలో 2000 మంది.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 13, 2022, 10:31 AM IST

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతున్న‌ది. మరీ ముఖ్యంగా మహాారాష్ట్రలో కోవిడ్‌-19 ఉప్పెనలా విరుచుకుప‌డుతోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 265 మంది పోలీసులు కోవిడ్-19తో మరణించారు. ఇంకా 2,000 మందికి పైగా  పోలీసులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత క‌రోనా వారియ‌ర్స్ ఎక్కువ‌గా వైర‌స్ బారిన‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 
 


Coronavirus: యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న‌ది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే అన్ని దేశాల‌కు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌కారిగా మారుతోంది. ఇదివ‌ర‌కు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్ర‌స్తుతం దాని కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో మ‌ళ్లీ క‌రోనా బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతున్న‌ది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ క‌రోనా వైర‌స్  (Coronavirus) కొత్త కేసులు ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలో (Maharashtra) అయితే, కొత్త కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. దీనికి తోడు క‌రోనావైర‌స్ పై సాగిస్తున్న యుద్ధంలో ముందుడి పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు అధికంగా వైర‌స్ బారిన‌ప‌డుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. 

మ‌హారాష్ట్రలో కోవిడ్‌-19 బారిన‌ప‌డ‌టంతో పాటు ప్రాణాలు కోల్పోతున్న క‌రోనా వారియ‌ర్స్ సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. మ‌హారాష్ట్రలో క‌రోనావైర‌స్ బారిన‌ప‌డి గురువారం నాటికి 265 మంది పోలీసులు (police ) ప్రాణాలు కోల్పోయార‌ని రాష్ట్ర పోలీసు శాఖ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. రాష్ట్రవ్యాప్తంగా (Maharashtra) క‌రోనా కార‌ణంగా చ‌నిపోయిన పోలీసుల్లో  (police ) అధికంగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యికి చెందిన పోలీసులే అధికంగా ఉన్నార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. కనీసం 126 మంది ముంబై పోలీసు సిబ్బంది COVID-19  కారణంగా ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా బారిప‌డుతున్న పోలీసుల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసుల్లో  2,145 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో గ‌త 24 గంటల్లో 370 మంది పోలీసులు (police ) కరోనావైరస్ బారిన‌ప‌డ్డార‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. కొత్త‌గా క‌రోనా సోకిన పోలీసు సిబ్బందిలో 60 మంది అధికారులు, 310 మంది కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 504 మంది అధికారులు, 1,678 మంది కానిస్టేబుళ్లు కరోనా సోకి ఆస్ప‌త్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. 

Latest Videos

ఇదిలావుండ‌గా,  మహారాష్ట్రలో క‌రోనా వైర‌స్ ఉధృతి అధికం అవుతూనే ఉంది. కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం అధికం కావ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మ‌హారాష్ట్రలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా  46,723 మందికి క‌రోనా సోకింది. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 70 ల‌క్ష‌ల మార్కును దాటిపోయింది. బుధ‌వారం ఒక్క‌రోజే 32 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ తో సంభ‌వించిన మ‌ర‌ణాలు 1,41,701కి పెరిగాయి. యాక్టివ్ కేసులు సైతం పెరిగిపోతున్నాఇ. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,43,849 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో కొత్త‌గా 86 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌వారి సంఖ్య 1,367 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 28,041 మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య Maharashtra లో 66,49,111కి చేరుకుంది. కొత్త కేసుల్లో ఒక్క ముంబ‌యిలోనే 16,420 నమోదయ్యాయి. 
 

click me!