కుప్పకూలిన పైకప్పు: శిదిలాల కింద 25 మంది

By narsimha lodeFirst Published Jul 31, 2019, 2:36 PM IST
Highlights

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కిందే 25 మంది చిక్కుకొన్నారు. 

 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షోలాపూర్ బ్రాంచ్ భవనం పై కప్పు బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 30 మంది చిక్కుకొన్నారు. ఈ ఘటనలో 8మందిని స్థానికులు రక్షించారు.

 

: The roof of the building that houses Bank of Maharashtra's branch in Solapur has collapsed. Over 20 people are feared trapped & 10 people have been evacuated. pic.twitter.com/VRcrBdMfIc

— ANI (@ANI)

షోలాపూర్ లోని స్టేట్ హైవేలోని కమలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ గ్రామం సోలాపూర్ కు 150 కి.మీ దూరంలో ఉంది.  విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకొన్నారు.

ఈ సీజన్ లో మహారాష్ట్రంలో భవనం కూలిన ఘటన ఇది రెండోది. డోంగ్రీలో భవనం కుప్పకూలిన ఘటనలో 13 మంది మృత్యువాత పడ్డారు.  ఈ ఘటన ఈ నెల 17వ తేదీన చోటుచేసుకొంది.

డోంగ్రీ ఘటన  మరువక ముందే షోలాపూర్ లో బ్యాంకు పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 25 మంది చిక్కుకొన్నారు. శిధిలాల కింద చిక్కుకొన్న 25 మందిలో 8 మందిని రక్షించారు.  

click me!