విధేయతకు పట్టం: కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

By Siva KodatiFirst Published Jul 31, 2019, 1:55 PM IST
Highlights

కర్ణాటక శాసనసభ నూతన స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త స్పీకర్‌ రేసులో కేజీ.బోపయ్య పేరు వినిపించినప్పటికీ.. హఠాత్తుగా విశ్వేశ్వర హెగ్డే తెరమీదకి వచ్చారు. 

కర్ణాటక శాసనసభ నూతన స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో స్పీకర్‌ పదవికి కేఆర్ సురేశ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి బుధవారం ఎన్నిక జరగనుంది.

ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. ఆ సమయంలోగా విశ్వేశ్వర హెగ్డే ఒక్కరే నామినేషన్ వేయగా.. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఏ ఒక్కరు రాజీనామా చేయలేదు.

దీంతో హెగ్డే స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1961 జూలై 10న జన్మించిన విశ్వేశ్వర హెగ్డే న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 నుంచి ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అయితే నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2008లో సిర్సి-సిద్ధాపుర నియోజకవర్గానికి తన కార్యక్షేత్రాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత 2013, 2018 నుంచి ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసుకున్నారు.

2008లో యడియూరప్ప ప్రభుత్వంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కొత్త స్పీకర్‌ రేసులో కేజీ.బోపయ్య పేరు వినిపించినప్పటికీ.. హఠాత్తుగా విశ్వేశ్వర హెగ్డే తెరమీదకి వచ్చారు. 

click me!