22ఏళ్ల క్రితం కూడా వికాస్ దూబే సేమ్ ప్లాన్.. కానీ..

By telugu news teamFirst Published Jul 21, 2020, 7:48 AM IST
Highlights

హత్యాయత్నం అభియోగాలపై వికాస్‌ను అరెస్టు చేసేందుకు వెల్లిన పోలీసులను అతని కుటుంబ సభ్యులు, అనుచరులు రోడ్డు తవ్వేసి అడ్డుకున్నారు. మరణాయుధాలతో దాడి చేశారు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే... అతని కేసు విషయంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. తనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసు దళంపై వికాస్‌, అతని అనుచరులు ఈ నెల రెండో తేదీ రాత్రి కాల్పులకు దిగి పరారైన సంగతి తెలిసిందే. 

సరిగ్గా 22 ఏళ్ల క్రితం కూడా వికాస్‌ ఇదే తరహాలో తప్పించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అప్పుడు వికాస్‌ బిక్రూ గ్రామానికి సర్పంచ్‌గా ఉన్నాడు. హత్యాయత్నం అభియోగాలపై వికాస్‌ను అరెస్టు చేసేందుకు వెల్లిన పోలీసులను అతని కుటుంబ సభ్యులు, అనుచరులు రోడ్డు తవ్వేసి అడ్డుకున్నారు. మరణాయుధాలతో దాడి చేశారు. అయితే.. అప్పుడు పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటంతో చేసేదిలేక వెనుదిరిగారు.

మళ్లీ 22 ఏళ్ల తర్వాత జులై 2 వ తేదీ రాత్రి కూడా సేమ్ అదే ఘటన రిపీట్ అయ్యిందని పోలీసులు చెప్పారు. అయితే.. ఈసారి మాత్రం వికాస్ దూబే తప్పించుకోలేకపోయాడు. ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. హత్యాయత్నం ఆరోపణలపై వికాస్‌ గ్యాంగ్‌ను అదుపులోకి పోలీసులు వెళ్లగా.. బుల్‌డోజర్లతో రోడ్డును ధ్వంసం చేసి అడ్డుకున్నారు. భవనంపైనుంచి పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దాంతో డీఎస్పీ సహా 8 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ హతమయ్యాడు.


 

click me!