నిర్భయ కేసు: క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముగ్గురు నిందితులు

By sivanagaprasad KodatiFirst Published Dec 24, 2019, 3:18 PM IST
Highlights

నిర్భయ కేసులో ఉరిశిక్ష విధించబడిన ముగ్గురు దోషులు క్షమాభిక్ష పిటిషన్ వేశారు. మంగళవారం తమ పిటిషన్‌కు సంబంధించిన పత్రాలను తీహార్ జైలు అధికారులకు అందజేశారు. 

నిర్భయ కేసులో ఉరిశిక్ష విధించబడిన ముగ్గురు దోషులు క్షమాభిక్ష పిటిషన్ వేశారు. మంగళవారం తమ పిటిషన్‌కు సంబంధించిన పత్రాలను తీహార్ జైలు అధికారులకు అందజేశారు. మొన్న నిర్భయ కేసు నిందితుడు పవన్ కుమార్ రివ్యూ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

కొద్దిరోజుల క్రితం నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకోగా.. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్‌లు దానిని తిరస్కరించాలని దేశాధ్యక్షుడికి సిఫారసు చేశాయి. దీనిపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర హోంశాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Also Read:దోషి అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ కొట్టివేత: నిర్భయ తల్లి హర్షం

కాగా.. దోషులుకు ఉరి శిక్ష దాదాపు ఖరారు కావడంతో అందుకు అవసరమైన సన్నాహాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఉరి తీయడానికి ఉపయోగించే తాళ్లను ఈ నెల 14 నాటికి తయారు చేయాల్సిందిగా బిహార్‌లోని బక్సార్ సెంట్రల్ జైలుకు ఆదేశాలు అందాయి. వీటిని నిర్భయ నిందితుల కోసమే తయారు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

నిర్భయ కేసులో దోషి అయిన అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి. త్రి సభ్య ధర్మాసనం తీర్పు స్వాగతించారు. 

త్రి సభ్యధర్మాసనం వెలువరించిన తీర్పు చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అభిప్రాయపడింది. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేస్తారన్న నమ్మకం తనకు కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే నిర్భయ కేసులో నలుగురు దోషులలో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ తనకు వేసిన ఉరిశిక్షపై పునరాలోచించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ ను జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని నూతన త్రి సభ్య ధర్మాసనం కొట్టివేసింది.

Also Read:నిర్భయ దోషి క్షమాపణకు అనర్హుడు, కనికరం వద్దు : సొలిసిటర్ జనరల్

దోషి అయిన అక్షయ్ కుమార్ పై త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నలుగురు నిందితులను ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడింది. దోషులపై ఎలాంటి దయ అవసరం లేదని స్పష్టం చేసింది ధర్మాసనం అభిప్రాయపడింది.

నలుగురు నిందితులను ఉరితీయాల్సిందేనని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితులు క్షమించరాని నేరం చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. దోషికి క్షమాపణ కోరే అర్హత లేదని స్పష్టం చేసింది. 

click me!