Young woman Cuts Tongue: నాలుక కోసి కాళీ మాత‌కు నైవేద్యంగా పెట్టిన యువతి

By Rajesh KFirst Published Jun 25, 2022, 6:45 AM IST
Highlights

Young woman Cuts Tongue: మధ్యప్రదేశ్​లోని సిహవాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్​కుమారీ పటేల్​..  స్థానికంగా ఉండే కాళీమాత అమ్మవారి ఆలయానికి తన నాలుకను కోసేసుకుని అమ్మవారి నైవేద్యంగా స‌మ‌ర్పించింది. ఈ ఘటనతో ఆమె తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న భక్తులంతా షాకయ్యారు.

Young woman Cuts Tongue:  దేవుళ్లకు భక్తులు ఎన్నో మొక్కులు మొక్కుకోవటం వాటిని తీర్చుకోవటం సర్వసాధారణంగా జరుగేదే. కానీ కొంతమంది మాత్రం భక్తి పేరుతో కాస్త అత్యుత్సాహం చూపిస్తుంటారు. అటువంటి ఘటనే జరిగింది మధ్యప్రదేశ్​లోని సీధీ జిల్లాలో. జిల్లాలోని బడా అనే గ్రామంలో ఓ యువతి తన నాలుకను కోసి అమ్మవారి పాదాలకు సమర్పిచింది. సదరు యువతి చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది.

దీనిని విశ్వాసం అంటారా ? లేదా మూఢనమ్మకం అంటారా?  తెలియ‌డం లేదు. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలోని బగౌడి గ్రామంలో ఓ యువతి ఆలయంలో పూజలు చేస్తూ తన నాలుక కోసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తర్వాత, గ్రామస్థులు ఆలయం వెలుపల పూజలు ప్రారంభించారు.  దేవత ఉత్సవాలు ప్రారంభించారు. 

సిధి జిల్లాలోని సిహవాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయితీ లో ఈ ఘటన  సంచలనం సృష్టించింది. ఆరోగ్య శాఖతో పాటు పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. కానీ, గ్రామస్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

సమాచారం ప్రకారం.. సిహవాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల రాజ్​కుమారీ పటేల్​ అనే యువ‌తి.. గురువారం త‌న‌ తల్లిదండ్రులతో క‌లిసి స్థానికంగా ఉండే కాళీమాత అమ్మవారి ఆలయానికి వచ్చింది. పూజ చేస్తుండగా ఉన్నట్లుండి యువతి తన నాలుకను కోసేసుకుని అమ్మవారి విగ్రహం పాదాల వద్దకు విసిరేసింది. ఈ ఘటనతో ఆమె తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్న భక్తులంతా షాకయ్యారు. వెంటనే జరిగిన విషయాన్ని తల్లి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. 

ఆ తర్వాత గ్రామం అంతా గుడి బయట గుమిగూడారు. అందరూ గుడి బయట విడిది చేసి పూజలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, ఈ వార్త తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ వెంటనే ఒక బృందాన్ని గ్రామానికి పంపింది. ఆరోగ్య శాఖ బృందంతో పాటు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తుల విశ్వాసం ముందు పాలనా యంత్రాంగం ఏమీ చేయలేకపోయింది.

ఘటనా స్థలానికి చేరుకున్న వైద్య‌బృందం యువ‌తికి  ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని ఆమె త్వరలోనే కోలుకుంటుందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అమ్మవారికి బలి ఇవ్వాలనే ఇలా చేసిందని పోలీసులు వెల్లడించారు.  అమ్మవారి పూజల వల్ల యువ‌తి నాలుక తిరిగి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. 

ఈ సందర్భంగా హాజరైన గ్రామస్తులు మాట్లాడుతూ.. అమ్మ వారి పై త‌మ‌కు నమ్మకం ఉందన్నారు. ఆ యువ‌తి కోరిక త‌ప్ప‌గా తీరుతుంద‌నీ, ఆ నమ్మకం ఉంద‌ని అంటున్నారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా.. త‌మ కూతురు ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డుతుంద‌ని ఊహించలేదని చెప్పారు. హఠాత్తుగా నాలుక కోసి అమ్మవారికి అంకితం ఇవ్వ‌డం షాక్ గా ఉంద‌ని అన్నారు. 

ఈ ఘటన గురించి యువ‌తి తండ్రి మాట్లాడుతూ.. గ్రామస్థులు చెప్పడంతో విష‌యం తెలిసింది. అందరూ పూజలు చేయడం ప్రారంభించారు. కాళీమాత అనుగ్రహం ఉంటే..తన‌ కుమార్తె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఆలయంలో పూజలు, వ్రతాలు కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బాలిక కు వైద్యం అందించ‌క‌పోతే.. ప‌రిస్థితి ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

click me!