Bengaluru: dating app వలలో Bank manager.. క‌స్ట‌మ‌ర్ల ఖాతాల నుంచి "మ‌యా లేడీ"కి రూ. 6 కోట్లు ట్రాన్స్ ఫ‌ర్

By Rajesh KFirst Published Jun 25, 2022, 5:54 AM IST
Highlights

Bengaluru: ఆన్​లైన్​ డేటింగ్​ యాప్​లో పరిచయమైన యువతి వలలో పడి ఓ బ్యాంకు మేనేజర్ భారీ​ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ కస్టమర్ ఖాతా నుంచి అక్రమ పత్రాలతో రూ.6 కోట్ల రుణం మంజూరు చేసి ఆ యువతికి ఇచ్చాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
 

Bengaluru: ఆన్​లైన్​ డేటింగ్ యాప్‌లో ప‌రిచ‌య‌మైన యువ‌తి మాయ‌లో ప‌డి..  ఓ బ్యాంక్ మేనేజర్ ఖాతాదారుల డ‌బ్బుల‌ను కాజేశాడు. భారీ స్కామ్ కు పాల్ప‌డ్డాడు. ఫేక్ డాక్యుమెంట్ పెట్టి... దాదాపు రూ. 6 కోట్లను నోక్కెశాడు. ఆ మొత్తం డ‌బ్బును మ‌యా లేడీ ఖాతాకు మళ్లించాడు. ఈ ఘ‌ట‌న కర్నాటక రాజ‌ధాని బెంగళూరులో బ‌య‌ట‌పడింది. 

బ్యాంకు మేనేజర్​ స్థాయిలో  ఉన్న వ్య‌క్తి ఆన్​లైన్​ dating app వలపు వలలో పడ్డాడు.​ డేటింగ్​ యాప్​లో పరిచయమైన యువతి వేసిన‌ ఉచ్చులో ప‌డ్డాడు. భారీ అక్రమానికి పాల్పడ్డాడు. ఓ  బ్యాంక్ కస్టమర్ పేరిట లోను తీసి.. అక్రమంగా దాదాపు రూ.6 కోట్లు లోను తీసి ఆ యువతి ఖాతాలో వేశాడు. ఈ త‌తంగం బ్యాంకు అంతర్గత తనిఖీల్లో బయటపడింది. దీనిపై ఉన్నతాధికారుల ఫిర్యాదు చేయడంతో బ్యాంకు మేనేజర్​ సహా అతడికి సహాయం చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటక బెంగళూరుకు చెందిన హరిశంకర్​ ఇండియన్​ బ్యాంకు హనుమంతనగర్​ Bank managerగా పనిచేస్తున్నాడు. గ‌త‌ నాలుగు నెలల కిందట ఓ dating app​లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఓ యువ‌తి అత‌నికి ప‌రిచ‌యం అయ్యింది. ఆ ప‌రిచ‌యం.. రోజురోజుకు పెరిగింది. ఈ క్ర‌మంలో ఆ యువ‌తి  త‌న‌కు చాలా అత్యవ‌స‌రంగా డబ్బుల కావాలని అడిగింది. దీంతో రూ.12 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. 

ఆ తర్వాత.. మరోసారి డబ్బులు ఇవ్వాలని కోరింది. ఈ సారి బ్యాంకులోని అనిత అనే ఖాతాదారురాలి అకౌంట్ ద్వారా రూ. 6 కోట్లు రుణాన్ని తీసి యువతి ఖాతాలో వేశాడు హరిశంకర్.అంతకుముందు అనిత తన ఖాతాలో రూ. 1.3 కోట్లు డిపాజిట్​ చేసుకుంది. తాజాగా రుణం కోసం దరఖాస్తు చేసుకుని.. దానికి సంబంధించిన పత్రాలను సమర్పించింది. అయితే, హరిశంకర్​ వాటిని తారుమారు చేసి రూ.6కోట్లు రుణం మంజూరు చేశాడు. ఆ డబ్బును డేటింగ్ యాప్​లో పరిచయమైన యువతికి ఇచ్చాడు.  అనేక వాయిదాల ద్వారా 5.7 కోట్ల రూపాయలను ఓవర్‌డ్రాఫ్ట్‌గా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు బ్యాంకులకు చెందిన 28 ఖాతాలకు, కర్ణాటకలోని రెండు ఖాతాలకు 136 లావాదేవీల్లో డబ్బు చేరినట్లు అంతర్గత విచారణ జరిపిన బ్యాంకు వెల్లడించింది. 

ఈ కేసులో బ్యాంక్ మేనేజ‌ర్ హ‌రిశంకర్ తో పాటు అత‌నికి స‌హాకరించిన అసోసియేట్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కౌసల్య జెరాయ్, క్లర్క్ మునిరాజులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మే 13 నుంచి 19వ తేదీ మధ్య ఈ మోసం జరిగినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో డేటింగ్ యాప్ లో ప‌రిచ‌యం అయిన యువ‌తికి డ‌బ్బు పంపిన‌ట్టు వెల్ల‌డించారు.

click me!