త్రిపురలో సరస్వతి విగ్రహం సంప్రదాయ చీరకట్టులో లేదని జరిగిన గొడవ తీవ్ర నిరసనలకు దారి తీసింది.
అగర్తల : త్రిపురలోని ఓ ప్రభుత్వ కాలేజీలో జరిగిన సరస్వతీ పూజ వేడుకలు ఉద్రికతలకు దారి తీశాయి. కాలేజీ విద్యార్థులు రూపొందించిన సరస్వతీ విగ్రహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంప్రదాయ చీర లేకుండా రూపొందించడం, అసభ్యంగా ఉండడం అందులో కనిపిస్తుంది. ఈ విగ్రహం మీద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యుల నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. ఈ వైరల్ వీడియో చూసిన బజరంగ్ దళ్ ఏబీవీపీకి మద్ధతుగా అక్కడికి రావడంతో పరిస్థితి సీరియస్ అయ్యింది.
త్రిపురలోని ఏబీవీపీ యూనిట్ ప్రధాన కార్యదర్శి దిబాకర్ ఆచార్జీ, సరస్వతీ దేవిని అసభ్యంగా చూపించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ..‘‘ఈరోజు వసంత పంచమి అని, దేశమంతటా సరస్వతీ దేవిని పూజిస్తారని మనందరికీ తెలిసిన విషయమే.. బుధవారం ఉదయం ప్రభుత్వ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజీలో సరస్వతీ దేవి విగ్రహం అసభ్యంగా ఉందని సమాచారం వచ్చింది’ అని ఆచార్జీ పేర్కొన్నారు.
undefined
Driverless Metro Rail: బెంగళూర్ చేరుకున్న ‘డ్రైవర్ లెస్’ మెట్రో .. త్వరలో ట్రయల్ రన్?
దీనిమీద నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారులు విగ్రహాన్ని చీరతో కప్పాలని నిర్వాహకుల మీద ఒత్తిడి చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ విద్యార్థి సంఘం ABVP, కళాశాల అథారిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిమీద త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ విగ్రహం హిందూ దేవాలయాల్లోని సంప్రదాయ శిల్ప రూపాలకు కట్టుబడి ఉందని, మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని కళాశాల అధికారులు వివరించారు. చివరికి విగ్రహాన్ని కళాశాల అధికారులు మార్చారు. ఈ గొడవతో విగ్రహాన్ని ప్లాస్టిక్ షీట్‌లతో కప్పి, పూజ పండల్ వెనుక ఉంచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, కాలేజీ లేదా ఏబీవీపీ, బజరంగ్ దళ్ లు ఏవీ దీనిమీద అధికారికంగా ఫిర్యాదులు చేయలేదు.