కారులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్..

By Rajesh KarampooriFirst Published Jan 26, 2023, 3:24 AM IST
Highlights

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఓ టీనేజ్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని నమ్మించి కారులో కూర్చుబెట్టుకుని ..  తర్వాత ఆ బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం నాగ్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని సావోనర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.   

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం.. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు రూపొందించిన ఆఘాత్యాలు ఆగడం లేదు. ఆడవాళ్లు కనిపిస్తే..చాలు కొందరూ కామాంధులు దారుణాలకు ఎగబడుతున్నారు. చిన్నా, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా మహిళలపై తెగబడి .. తమ కామా వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా మహారాష్ఱ్రలోని నాగపూర్ లో దారుణం జరిగింది. తాజాగా సామూహిక అత్యాచారం ఘటన తెరపైకి వచ్చింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సమాచారం ప్రకారం నాగ్‌పూర్ జిల్లాలోని సావ్నర్ తాలూకాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  దీంతో నాగ్‌పూర్‌లో మరోసారి మహిళల భద్రత ప్రశ్న తలెత్తింది.

గత వారం నాగ్‌పూర్ జిల్లా నుండి సామూహిక దురాగతాల సంఘటన తెరపైకి రావడం గమనించవచ్చు. పొలంలో పత్తి సేకరించడానికి వెళ్లిన మహిళపై నిందితులు అత్యాచారం చేశారు, ఇది మాత్రమే కాదు, వారు క్రూరత్వానికి అన్ని హద్దులు దాటారు, అవును, హింసించిన తర్వాత, మహిళను చంపారు. ఈ విషయం తాజాగా మరోసారి జిల్లాలో ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది.

వాస్తవానికి..ఈ సిగ్గుచేటు సంఘటన గురించి మరింత సమాచారం ఏమిటంటే.. నాగ్‌పూర్ జిల్లాలోని సావ్నర్ తాలూకాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోతున్న సమయంలో .. కొందరూ కామాంధులు నమ్మించి.. కారులో కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత బాలికను ఖాపా-కోడెగావ్ ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. ఆ తరువాత లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే.. ఆ నిందితులిద్దరికీ బాధిత యువతితో పరిచయం ఉండడంతో ఆమె ఆ కారులో కూర్చున్నట్లు సమాచారం. అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకున్న నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

నిందితులను అరెస్టు 

ఈ ఘటన నాగ్‌పూర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారన్నారు. ఈ ఘటనలో  అక్కీ భోంగ్, పవన్ భాస్కవరే లను నిందితులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

click me!