అయోధ్య రాముడి కోసం 108 అడుగుల బాహుబలి అగర్బత్తి..

By SumaBala Bukka  |  First Published Dec 21, 2023, 10:00 AM IST

గుజరాత్, వడోదర నివాసి బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశాడు. 


వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ రోజున రామ మందిర మహాసమారోహే ప్రాణ స్థాపనలో దేశం నలుమూలల నుండి రామభక్తులు పాల్గొంటారు. పండుగతో పాటు.. వివిధ సాంస్కృతిక, పౌరాణిక కార్యక్రమాలు జరగనున్నాయి. యేళ్లతరబడి ఎదురుచూస్తున్న రామాలయం పవిత్ర ప్రారంభోత్సవానికి అయోధ్య అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. దేశ,విదేశాల్లో ఉన్న రామ భక్తులు తమకు తోచిన రీతిలో ఉడతాసాయంగా రకరకాలుగా భక్తి కురిపిస్తున్నారు. 

సూరత్ కు చెంది ఓ వ్యాపారి రామాలయ నమూనాతో వజ్రాల కంఠాభరణాన్ని రూపొందించి కానుకగా ఇవ్వబోతున్నాడు. అదే రీతిలో గుజరాత్ కు చెందిన ఓ భక్తుడు 108 అడుగుల భారీ అగర్ బత్తీని తయారు చేసి రామాలయానికి కానుకగా ఇవ్వనున్నారు. గుజరాత్, వడోదర నివాసి బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగరుబత్తిని తయారు చేశాడు. 

Latest Videos

అయోధ్యలో భద్రత మరింత పెంపు.. డ్రోన్స్ కు నో ఎంట్రీ...

ఈ అగర్ బత్తి ఒక నెల, నెలన్నర వరకు వెలుగుతుంది. దీని తయారీలో యజ్ఞంలో ఉపయోగించే వివిధ పదార్థాలను ఉపయోగించారు. ప్రొటోకాల్ ప్రకారం సుమారు 3,500 గ్రాముల బరువున్న ఈ ధూపదీపాన్ని రోడ్డు మార్గంలో రథంలో అయోధ్యకు తరలిస్తారు. దీన్ని తీసుకుని జనవరి 1న ఉదయం 10 గంటలకు వడోదర నుంచి అయోధ్యకు బయలుదేరుతారు.

ప్రొటోకాల్ ప్రకారం రాజస్థాన్ రోడ్డు మీదుగా అగర్ బత్తి అయోధ్యకు చేరుకుంటుంది. వడోదర నుంచి వచ్చే భారీ ధూపం హోలోల్, కలోల్, గోద్రా షెహ్రా, అరబల్లి, మోడసా, షామ్లాజీ మీదుగా రాజస్థాన్‌లోకి ప్రవేశించి గుజరాత్ సరిహద్దును దాటి అక్కడి నుంచి ఖేర్వారా, ఉదయపూర్, మాల్వారా, సవారియా సేథ్ మందిర్, చిత్తోర్‌గఢ్, భిల్వారా, దయా, కిషన్‌గఢ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి మెహందీపూర్, బాలాజీ చోరియా, భరత్‌పూర్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా, లక్నో, ఇటావా, కాన్పూర్, ఉన్నావ్, లక్నో, బారాబంకి మీదుగా అయోధ్యకు చేరుకుంటుంది.

ఈ అగర్ బత్తీని జాగ్రత్తగా తీసుకెళ్లేందుకు పొడవాటి ట్రైలర్‌కు జోడించిన రథాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది రాజస్థాన్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని రామాలయం వరకు దాదాపు 1,800 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఈ అగర్ బత్తీని ఒక్కసారి వెలిగిస్తే దాదాపు 45 రోజులవరకు మండుతూనే ఉంటుంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రామభక్తులకు రామమందిర కల సాకారమవుతోంది. అద్భుతంగా రూపొందించిన రాముడి విగ్రహాన్ని ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహా ఉత్సవాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనేందుకు దేశం మొత్తం ఆసక్తి చూపుతోంది. వడోదర రామ భక్తులు మొత్తం గుజరాత్ తరపున భగవంతుని పాదాల వద్ద తమ నైవేద్యంగా ఈ భారీ దూప్ స్టిక్ ను సమర్పించారు.

జీవన్ దయా గోరక్షా సమితి జాతీయ అధ్యక్షుడు బిహా కర్సన్‌భాయ్ వృత్తిరీత్యా గోసంరక్షకుడు, రామభక్తుడు. గతంలో కూడా మూడుసార్లు భారీ అగరుబత్తీలను తయారు చేశాడు. ఇప్పుడు కొత్త రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా 108 అడుగుల పొడవు,  3,500 కిలోల బరువున్న వృత్తాకార అగర్ బత్తీని నెయ్యి, నువ్వులు, బార్లీ, వివిధ యజ్ఞ పదార్థాలతో తయారు చేసి శ్రీరాముడికి సమర్పిస్తున్నారు.

ఆరు నెలలపాటు ప్రతిరోజూ రెండున్నర నుంచి మూడు గంటలపాటు శ్రమించి బీహాభాయ్ భర్వాద్ ఒంటరిగా ఈ అగర్బత్తిని తయారు చేశారు. వర్షాకాలంలో వర్షం వల్ల అగర్ బత్తీ ఆరిపోకుండా దానిపై సన్నని ప్లాస్టిక్ చుట్టను కూడా ఏర్పాటు చేశారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ అగరబత్తీ సిద్ధమవుతుంది. ఈ ధూపాన్ని సిద్ధం చేయడానికి రామ భక్తులు బీహా భర్వాడ్‌కు సహాయం చేశారు.

click me!