చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత: భారత కల్నల్ సహా ముగ్గురు మృతి, 1975 తరువాత ఇదే తొలి మరణం!

By Sree s  |  First Published Jun 16, 2020, 2:26 PM IST

భారత్, చైనా సరిహద్దు వెంబడి లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితులను శాంతిపజేయడానికి ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు నడుస్తుండగానే నిన్న రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  


భారత్, చైనా సరిహద్దు వెంబడి లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్త పరిస్థితులను శాంతిపజేయడానికి ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు నడుస్తుండగానే నిన్న రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  

భారత రక్షణ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం నిన్న రాత్రి భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ఒక కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మృతిచెందినట్టు చెప్పారు. రక్షణ శాఖ తొలిప్రకటనలో కేవలం భారత సైనికులు మాత్రమే చనిపోయారు అని పేర్కొన్నప్పటికీ... సవరించిన ప్రకటనలో ఇరు వైపులా సానికులు మరణించారని పేర్కొంది. 

Latest Videos

undefined

నిన్న రాత్రి గాల్వాన్ లోయ ప్రాంతంలో నెలకొంనా ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి ఇరు దేశాల అధికారులు చర్చిస్తున్న ప్రయత్నంలో హింసాత్మకంగా మారి ఇరు దేశాల సైనికులు కూడా ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఇరువైపులా సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు ఆర్మీ అధికారులు. 

ప్రస్తుతానికి నిన్న రాత్రి ఎక్కడైతే ఈ సంఘటన చోటు చేసుకుందో.... అదే ప్రాంతంలో ఇరు దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు చర్చల ద్వారా సామరస్యంగా ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు శ్రమిస్తున్నారని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ గాల్వాన్ లోయ ప్రాంతం 1962 నుంచి భారతీయుల ఆధీనంలోనే ఉంది. ఈ గాల్వాన్ లోయ ప్రాంతంలో ఇటు భారత్, అటు చాలా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1975 తరువాత ఇంతవరకు ఈ ప్రాంతంలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. చనిపోయిన అధికారిని కమాండింగ్ ఆఫీసర్ గా గుర్తించారు. 

కమాండింగ్ ఆఫీసర్ స్థాయి అధికారి మరణించడంతో భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. ఇరుదేశాల సైనికులు రాళ్లు, అక్కడ అందుబాటులో ఇతర వస్తువులతో మాత్రమే దాడి చేసుకున్నారు తప్ప బులెట్ మాత్రం ఫైర్ చేయలేదని తెలియవస్తుంది. దీనిపై పూర్తిసమాచారం తెలియవలిసి ఉంది. 

 

click me!