న్యూఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మంగళవారం నాడు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ లో ఆయన చేరారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మంగళవారం నాడు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ లో ఆయన చేరారు.
తీవ్రమైన జ్వరం, శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నాడు. ఆదివారం నాటి నుండి ఆయనకు అనారోగ్య లక్షణాలు ఉన్నట్టుగా తెలిపారు.
undefined
సోమవారం రాత్రి నుండి తీవ్రమైన జ్వరంతో పాటు తన ఆక్సిజన్ లెవల్స్ ఆకస్మాత్తుగా పడిపోవడంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నాడు ఉదయం ఆయన ట్వీట్ చేశారు.
24 గంటల పాటు ప్రజలకు సేవ చేస్తున్నందున వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ మంత్రి సత్యేంద్రజైన్ కు సూచించారు. సత్యేంద్రజైన్ ట్వీట్ కు ఆయన రిప్లై ఇచ్చారు.సత్యేంద్రజైన్ కు ఇవాళ కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు.
గత వారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడ అనారోగ్యంతో బాధపడ్డాడు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా లేదని తేలింది.
ఢిల్లీలో కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం నాడు ఢిల్లీలో అఖిలపక్షాలతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.