ఉన్నావ్ బాధితురాలికి న్యాయం: సుప్రీం హామీ

By narsimha lodeFirst Published Jul 31, 2019, 2:57 PM IST
Highlights

ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. బాధఇతురాలిని అన్ని విధాలుగా ఆదుకొంటామని కోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ:  ఉన్నావ్ బాధితురాలి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొంది. బాధితురాలు సుప్రీంకోర్టుకు రాసిన లేఖను ఆలస్యంగా తనకు చేరడంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్రంగా స్పందించారు.

యూపీలో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెగార్ ఓ యువతిపై అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వారం రోజుల క్రితం ఆ యువతి ప్రయాణీస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. 

అయితే ఈ ప్రమాదం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని పోలీసులు గుర్తించారు.ఈ విషయమై  ఎమ్మెల్యేపై సీబీఐ కేసు నమోదు చేసింది.ఉన్నావ్ రేప్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని యూపీ అధికారులను సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. రెండేళ్ల పాటు తనపై బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెగార్ అత్యాచారానికి పాల్పడినట్టుగా యువతి ఆరోపిస్తోంది.

గత ఆదివారం నాడు కుటుంసభ్యులతో కారులో యువతి ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఆమె ప్రయాణీస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఈ ప్రమాదంలో బాధిత కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. బాధితురాలి న్యాయవాది కూడ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితురాలు కూడ తీవ్రంగా గాయపడింది. ఈ నెల 7వ తేదీన కుల్ దీప్ సింగ్ సెగార్  సోదరుడు మనోజ్ సింగ్, కున్ను సింగ్ మిశ్రాలు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
 

click me!