తాను పరమశివుడిని అని, తనను ఎవరూ తాకలేరని, ఏ కోర్టు కూడా తనను విచారించలేదని వివాదాస్పద స్వామి నిత్యానంద అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ: అత్యాచారం, లైంగిక దాడి కేసులను ఎదుర్కుంటున్న వివాదాస్పద స్వామి నిత్యానందకు సంబంధించిన వీడియో ఒక్కటి వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిక తనను ఎవరూ తాకలేరని, ఏ కోర్టు కూడా తనను విచారించలేదని ఆయన అన్నారు. అపహరణ, అహ్మదాబాద్ ఆశ్రమంలో అక్రమ నిర్బంధం కేసుల్లో ఆయన కోసం గుజరాత్ పోలీసులు గాలిస్తున్నారు.
వాస్తవాన్ని, సత్యాన్ని వెల్లడించి తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తానని, ఇక తనను ఎవరూ తాకలేరని, సత్యం చెబుతానని, తాను పరమ శివుడ్ని అని ఆయన అన్నారు. అర్థమవుతుందా, సత్యాన్ని వెల్లడించే విషయంలో ఏ కోర్టు కూడా విచారణ చేయలేదని ఆయన అన్నారు.
also Read: సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద: పేరు ఇదే..!!
ఆ వీడియో చిత్రీకరణ ఎప్పుడు జరిగిందనేది తెలియదు. కానీ నవంబర్ 22వ తేదీ నుంచి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత రహస్యమైన స్థలంలో దాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
కైలాస పేరుతో నిత్యానంద సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. సరిహద్దులు లేని అతి పెద్ద దేశం తనదని ఆయన చెప్పుకున్నారు. కైలాసకు సంబంధించిన ప్రణాళికలో ఓ వైబ్ సైట్ రూపకల్పన కూడా చేసుకున్నాడు.
Also Read: నిత్యానంద కొత్త దేశం... వీసా ఎలా పొందాలంటూ అశ్విన్ ట్వీట్
పలు కేసులను ఎదుర్కుంటున్న 41 ఏళ్ల నిత్యానంద ఎక్కడున్నాడనే విషయం పోలీసులు, అధికారులు కనిపెట్టలేకపోతున్నారు. పోస్ పోర్టు కోసం అతను పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం రద్దు చేసింది. నిత్యానందను కనిపెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
నిత్యానంద దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా, దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం వెబ్ సైట్ రూపకల్పన చేసుకోవడమంత సులభం కాదని ఆయన జవాబిచ్చారు.