భారత్ లో అడుగుపెట్టాక.. అభినందన్ తొలిమాట ఇదే..

Published : Mar 02, 2019, 09:34 AM IST
భారత్ లో అడుగుపెట్టాక.. అభినందన్ తొలిమాట ఇదే..

సారాంశం

పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం భారత గడ్డపై అడుగుపెట్టారు. 

పాకిస్థాన్ చెరలో చిక్కుకున్న భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం భారత గడ్డపై అడుగుపెట్టారు. అట్టారీ-వాఘా సరిహద్దులో ఆయనకు ఘనస్వాగతం లభించింది. దేశభక్తికి ప్రతిరూపంలా అభినందన్ .. స్వేదేశంలో అడుగుపెడుతుంటే.. దేశ ప్రజలు జై హింద్ నినాదాలతో హోరెత్తించారు.

దాదాపు రెండు రోజుల పాటు.. పాక్ చెరలో ఉన్న అభినందన్.. స్వదేశంలో అడుగుపెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గుడ్ టు బీ బ్యాక్ అంటూ తన స్పందనను తెలియజేశాడు. అమృత్‌సర్ నగర డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడిన సందర్భంగా అభినందన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉండగా.. స్వదేశానికి వచ్చిన అభినందన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నామని వాయుసేన అధికారులు తెలిపారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ మాకు అప్పగించడం ఎంతో ఆనందం కలిగించిందన్న ఐఏఎఫ్.. అభినందన్‌ను వైద్య పరీక్షలకు పంపించనుంది. అదేవిధంగా ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ఆయనను ప్రశ్నించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం