మహారాష్ట్రలో బీజేపీ శివ సేనల కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. బీజేపీ శివసేన కూటమి 192-216 సీట్లు గెలుస్తుందని,కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 55 నుంచి 81 సీట్లు గెలుస్తుందని, ఇతరులు 4 నుంచి 21 సీట్ల మధ్య గెలవొచ్చని ఏబీపీ సర్వే ప్రకటించింది. గత సంవత్సరం కన్నా పోలింగ్ భారీగా తగ్గింది.
రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మరో 64 స్థానాలకు పోలింగ్ ఇందాకే ముగిసింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. హర్యానా, మహారాష్ట్రలో పోలింగ్ 50శాతాన్ని దాటింది.
మహారాష్ట్రలో బీజేపీ శివ సేనల కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. బీజేపీ శివసేన కూటమి 192-216 సీట్లు గెలుస్తుందని,కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 55 నుంచి 81 సీట్లు గెలుస్తుందని, ఇతరులు 4 నుంచి 21 సీట్ల మధ్య గెలవొచ్చని ఏబీపీ సర్వే ప్రకటించింది. గత సంవత్సరం కన్నా పోలింగ్ భారీగా తగ్గింది.
undefined
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు కేవలం ఒక దఫాలోనే ఎన్నికలకు వెళ్లాయి. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం, మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కొనసాగుతాయా లేదా అనే విషయం 24వ తేదిన జరగనున్న కౌంటింగ్ రోజు తెలియనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీని ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఆదరించిన స్థాయిలోనే ఆదరిస్తారా, లేదా కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి ఎమన్నా సుర్ప్రైజ్ ఇస్తుందా అనే విషయం కూడా అదే రోజు తేలనుంది.
కాకపోతే పవనాలు ఎటువైపు వీస్తున్నాయి తెలుసుకోవడానికి మాత్రం ఈ ఎగ్జిట్ పోల్ ఉపయోగపడుతుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చాలా సార్లు తారుమారైన సందర్భాలనూ మనం చూసాము. 2004లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినప్పటికీ, అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. సాంకేతికంగా బాగా అడ్వాన్స్ అవుతున్న నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ మరింత పరిణితిని సాధించాయని చెప్పొచ్చు. ఎన్ని సీట్లొస్తాయో చెప్పడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వొచ్చు కానీ, ఎంత శాతం ఓట్లు ఏ పార్టీకి వస్తాయో చెప్పడంలో మాత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా ఒకటే ట్రెండ్ ను చూపెడుతున్నాయి.
Read more #Exit polls రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ సర్వే : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిదే హవా...
మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు.
బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు.
మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది.