లైంగిక వేధింపులు అవాస్తవం: కేంద్ర మంత్రి ఎంజె అక్బర్

By narsimha lodeFirst Published Oct 14, 2018, 4:21 PM IST
Highlights

తనపై  వచ్చిన  ఆరోపణలను కేంద్ర  విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి  ఎంజె అక్బర్ తీవ్రంగా ఖండించారు


న్యూఢిల్లీ: తనపై  వచ్చిన  ఆరోపణలను కేంద్ర  విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి  ఎంజె అక్బర్ తీవ్రంగా ఖండించారు.  ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని ప్రకటించారు. 

విదేశీ పర్యటనను ముగించుకొని  ఆదివారం నాడు కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు.  మధ్యాహ్నం  అక్బర్  ఓ ప్రకటనను విడుదల చేశారు.

తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకొంటానని  ఆయన హెచ్చరించారు. తనను అప్రతిష్టపాల్జేసేందుకే  కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రకటించారు.

తనపై చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలని ఆయన  డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలకు రుజువు చేయకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. 

కేంద్ర మంత్రి అక్బర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని  కొందరు మహిళా జర్నలిస్టులు  ఆరోపించిన విషయం తెలిసిందే . మీ టూ ఉద్యమంలో భాగంగా ఈ ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా చేయాలని విపక్షాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ తరుణంలోనే  అక్బర్ స్టేట్ మెంట్ ప్రాధాన్యతను సంతరించుకొంది.

click me!