లోక్‌సభ: ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ (లైవ్)

By narsimha lodeFirst Published May 23, 2019, 7:34 AM IST
Highlights

దేశంలోని 542 లోక్‌సభ స్థానాలకు గాను 8040 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.  
 

ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

దేశ వ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభం

తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ స్థానానికి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్న ఆయా పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజంట్లు

ఇంటి నుండే ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలించనున్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్

దేశంలోని 542 లోక్‌సభ స్థానాలకు గాను 8040 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.  

ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

దేశ వ్యాప్తంగా తొలిసారిగా ఈవీఎంలలోని ఓట్లను, వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతారు. దేశ వ్యాప్తంగా 20,600 పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని ఓ కౌంటింగ్ కేంద్రం వద్ద సీఆర్‌పీఎఫ్ జవాను సతీష్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. 
 

click me!