మాక్ ఓట్లకు బదులుగా అసలు ఓట్లను తొలగించారు

By narsimha lodeFirst Published May 22, 2019, 3:32 PM IST
Highlights

మాక్ పోలింగ్‌లో నమోదైన ఓట్లను కాకుండా ఓటర్లు నమోదు  చేసుకొన్న ఓట్లను అధికారులు తొలగించారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ విషయమై అధికారులు విచారణకు ఆదేశించారు.

సిమ్లా: మాక్ పోలింగ్‌లో నమోదైన ఓట్లను కాకుండా ఓటర్లు నమోదు  చేసుకొన్న ఓట్లను అధికారులు తొలగించారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ విషయమై అధికారులు విచారణకు ఆదేశించారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలింగ్‌కు గంటకు ముందు 50 టెస్ట్ ఓట్లు వేయిస్తారు. వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు.

అయితే ఆదివారం నాడు జరిగిన తుది విడత పోలింగ్ లో ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో మాక్ పోలింగ్ లో నమోదైన ఓట్లను అధికారులు డిలీట్ చేయడం మర్చిపోయారు. సాధారణ ఓటర్లతో పాటు ఈ ఓట్లు కూడ అలానే ఈవీఎంలలో ఉన్నాయి.

ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు మాక్ పోలింగ్‌లో నమోదైన ఓట్లను డిలీట్ చేయాలని భావించారు. ఈ క్రమంలోనే మాక్‌ పోలింగ్‌లో నమోదైన ఓట్లతో పాటు వాస్తవంగా నమోదైన ఓట్లను కూడ తొలగించారు.

ఈ విషయం  రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఐదుగురు ప్రిసైడింగ్ అధికారులతో పాటు మరో 15 మంది పోలింగ్ సిబ్బందిపై వేటు  వేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి నిర్ణయం తీసుకొన్నారు.

click me!